AP Inter Results 2024: ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ ఇక్కడ నేరుగా చెక్‌ చేసుకోండి

Srilakshmi C

|

Updated on: Apr 12, 2024 | 3:04 PM

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ రోజు (ఏప్రిల్‌ 12) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలో ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు..

AP Inter Results 2024: ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ ఇక్కడ నేరుగా చెక్‌ చేసుకోండి
AP Inter Results

అమరావతి, ఏప్రిల్‌ 12: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఈ రోజు (ఏప్రిల్‌ 12) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలో ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శుక్రవారం ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఇంటర్‌ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నట్లు ఇంటర్‌ బోర్డు ఇప్పటికే స్పష్టం చేసింది. ఫలితాలు విడుదలైన తర్వాత టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌లో నేరుగా రిజల్ట్స్ చెక్‌ చేసుకోవచ్చు.

కాగా 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి రెగ్యులర్‌, ఒకేషనల్‌ విద్యార్థులు కలిపి ఫస్టియర్‌లో 5,17,617 మంది విద్యార్ధులు, సెకండ్ ఇయర్‌లో 5,35,056 మంది విద్యార్ధులు పరీక్షలకు ఫీజు చెల్లించారు. వీరిలో 9,99,698 మంది పరీక్షలకు హాజరయ్యారు. అంటే దాదాపు 52,900 మంది విద్యార్ధులు పరీక్షలకు గైర్హాజరయ్యారు. ఈ పరీక్షలను త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు కాస్త ముందుగానే ఇంటర్ బోర్డు నిర్వహించింది.

ఏపీ ఇంటర్ ఫలితాలు ఇక్కడ నేరుగా చెక్ చేసుకోండి..

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల 2024 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 12 Apr 2024 01:37 PM (IST)

    సప్లిమెంటరీలో పాసైన విద్యార్థులకూ రెగ్యులర్ విద్యార్ధులకు ఇచ్చే సర్టిఫికెట్‌ అందజేస్తాం: ఇంటర్ బోర్డు

    ఏప్రిల్‌ 1 నుంచి 20వ తేదీ వరకు జరిగిన ఇంటర్‌ వార్షిక పరీక్షలు 1559 ఎగ్జామినేషన్‌ సెంటర్లలో జరిగాయి. మార్చి 18 నుంచి ఏప్రిల్ 6 వరకు 25 సెంటర్లలో స్పాల్‌ వాల్యుయేషన్‌ జరిగింది. రీకౌంటింగ్‌, రీవాల్యుయేషన్‌ ఫీజు చెల్లింపులు ఏప్రిల్‌ 18 నుంచి 24 వరకు అవకాశం కల్పించారు. మే 24 నుంచి జూన్‌ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి. ఏప్రిల్ 18వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించాలని ఇంటర్‌ బోర్డు అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. సప్లమెంటరీలో పాసైన విద్యార్థులకు కూడా రెగ్యులర్ విద్యార్ధులకు ఇచ్చే సర్టిఫికెట్‌ను అందజేస్తారు. ఫెయిల్‌ అయిన విద్యార్ధులకు తల్లిదండ్రులు మనోధైర్యం కల్పించాలని, ఇప్పటికే విద్యార్థులకు అన్ని కళాశాల్లో కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు.

  • 12 Apr 2024 01:08 PM (IST)

    ఏప్రిల్ 18 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపులు షురూ

    ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్ధులు, ఇంప్రూవ్‌మెంట్‌ రాయగోరే విద్యార్ధులు ఏప్రిల్ 18వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించాలని ఇంటర్‌ బోర్డు తెలిపింది. సప్లీ ఎగ్జాం ఫీజు చెల్లింపులకు ఏప్రిల్ 24వ తేదీని తుది గడువుగా వెల్లడించింది.

  • 12 Apr 2024 01:04 PM (IST)

    ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పటి నుంచంటే.. రోజుకు 2 సెషన్లు

    ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. మే 24వ తేదీ నుంచి జూన్‌ 1వ తేదీ వరకు ఇంటర్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. రోజుకు రెండు సెషన్ల చొప్పున సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండ్‌ సెషన్‌ పరీక్షలు జరుగుతాయి. ఫెయిల్‌ అయిన విద్యార్ధులతోపాటు మార్కుల ఇంప్రూవ్‌మెంట్‌ కోసం కూడా పరీక్షలు రాయవచ్చు. అలాగే సప్లీ ప్రాక్టికల్‌ పరీక్షళు మే 1 నుంచి 4వ తేదీ వరకు జిల్లా హెడ్‌ క్వార్టర్స్‌లో నిర్వహిస్తామని ఇంటర్‌ బోర్డు స్పష్టం చేసింది.

  • 12 Apr 2024 12:58 PM (IST)

    గతేడాది కంటే ఈసారి పెరిగిన ఉత్తీర్ణత శాతం

    ఈ ఏడాది 10,02,150 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ 67 శాతం, సెకండ్‌ ఇయర్‌లో 78 శాతం మంది ఉత్తీర్ణత పొందారు. గత ఏడాది కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందినట్లు ఇంటర్ బోర్డు అధికారులు స్పష్టం చేవారు. ఈ ఏడాది కృష్ణా జిల్లా ఫస్ట్ ఇయర్ , సెకండ్ ఇయర్ ఫలితాలలో మొదటి స్థానంలో నిలిచింది.

  • 12 Apr 2024 12:33 PM (IST)

    ఏపీ ఇంటర్‌ విద్యార్ధులకు గమనిక.. రీకౌంటింగ్‌కు ఛాన్స్‌!

    ఏపీ ఇంటర్‌ ఫలితాల్లో మార్కులు ఆశించిన వాటి కంటే తక్కువగా వచ్చిన విద్యార్ధులకు ఇంటర్‌ బోర్డ్‌ ముఖ్య సూచనలు జారీ చేసింది. రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు ఛాన్స్‌ ఇచ్చింది. ఏప్రిల్‌ 18, 2024 నుంచి ఏప్రిల్ 24, 2024వ తేదీ వరకు రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు అవకాశం ఇస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు స్పష్టం చేసింది.

  • 12 Apr 2024 11:45 AM (IST)

    ఏపీ ఇంటర్‌ ఫలితాల్లో అమ్మాయిల హవా..

    ఏపీ ఇంటర్ 2024 ఫలితాలు.. ఫస్ట్‌ ఇయర్‌లో అబ్బాయిలు 64 శాతం, అమ్మాయిలు 71 శాతం ఉత్తీర్ణత పొందారు. సెకండ్‌ ఇయర్‌లో అబ్బాయిలు 75 శాతం, అమ్మాయిలు 81 శాతం ఉత్తీర్ణత పొందారు. ఇక ఒకేషన్‌లోనూ అమ్మాయిలు ఫస్ట్‌ ఇయర్‌ 70 శాతం, సెకండ్‌ ఇయర్‌ 80 శాతం ఉత్తీర్ణతతో విజయ దుందుభి మోగించారు. అబ్బాయిలు ఫస్ట్‌ ఇయర్‌ 47 శాతం, సెకండ్‌ ఇయర్‌ 59 శాతం ఉత్తీర్ణత పొందారు.

  • 12 Apr 2024 11:43 AM (IST)

    ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ పాస్‌ పర్సెంటైల్‌ ఇదే

    ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో 4,99,756 మంది, సెకండ్ ఇయర్‌లో 5,02,394 మంది, ప్రైవేట్‌లో సెకండ్‌ ఇయర్‌ 76,298 మంది.. మొత్తం కలిపి 10,02,150 మంది ఈ ఏడాది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ 67 శాతం, సెకండ్‌ ఇయర్‌లో 78 శాతం మంది ఉత్తీర్ణత పొందారు.

  • 12 Apr 2024 11:39 AM (IST)

    ఇంటర్‌ ఒకేషన్‌లో ఉత్తీర్ణత శాతం ఇలా..

    ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఒకేషనల్ 38,483 మంది పరీక్షలకు హాజరవగా.. 23,181 మంది (60 శాతం) ఉత్తీర్ణత పొందారు. ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ ఒకేషనల్‌కు సంబంధించి 32,339 మంది పరీక్షలకు హాజరవగా.. వీరిలో 23,000 మంది (71 శాతం) ఉత్తీర్ణత పొందారు.

  • 12 Apr 2024 11:34 AM (IST)

    ఇంటర్ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ ఉత్తీర్ణత శాతం ఎంతంటే

    మార్చి 2024లో ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌కు సంబంధించి జనరల్ స్టూడెంట్స్ 4,61,273 పరీక్షలు రాయగా 3,10,875 మంది ఉత్తీర్ణత పొందారు. అంటే 67 శాతం పాస్‌ పర్సెంటైల్‌ నమోదైంది. ఇక సెకండ్‌ ఇయర్‌కు సంబంధించి జనరల్ స్టూడెంట్స్ 3,93,757 మంది పరీక్షలు రాయగా.. వారిలో 3,60,528 మంది ఉత్తీర్ణత పొందారు . అంటే 78 శాతం పాస్‌ పర్సెంటైల్‌ నమోదైంది. మొత్తం 8,55,030 మంది జనరల్ విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యారు.

  • 12 Apr 2024 11:21 AM (IST)

    ఏపీ ఇంటర్ ఫలితాలు ఇక్కడ నేరుగా చెక్ చేసుకోండి..

  • 12 Apr 2024 11:13 AM (IST)

    ఇంటర్ సెకండ్ ఇయర్‌ ఫలితాల్లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన జిల్లాలు ఇవే

    ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ రిజల్ట్స్‌కు సంబంధించి కూడా కృష్ణా జిల్లా 90 శాతం ఉత్తీర్ణతతో తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 87 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు రెండో స్థానంలో ఉంది. ఎన్‌టీఆర్‌ జిల్లా కూడా 87 శాతం ఉత్తీర్ణత సాధించి రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో 84 శాతం ఉత్తీర్ణతతో వైజాగ్ నిలిచింది.

  • 12 Apr 2024 11:10 AM (IST)

    ఇంటర్‌ ఫలితాల్లో ఆగ్రస్థానంలో నిలిచిన జిల్లా ఇదే..

    ఫలితాల్లో ఫస్ట్‌ ఇయర్‌కు సంబంధించి కృష్ణ జిల్లా 84 శాతం ఉత్తీర్ణతతో తొలిస్థానంలో నిలిచింది. ఆ తర్వాత రెండో స్థానంలో 81 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు, 79 శాతం ఉత్తీర్ణతతో ఎన్‌టీఆర్‌ జిల్లా మూడో స్థానంలో నిలిచింది

  • 12 Apr 2024 11:08 AM (IST)

    ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

    ఇంటర్ బోర్డ్‌ కంట్రోలర్ ఇంటర్ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. 20 రోజుల్లో ఇంటర్ పరీక్షలు వాల్యుయేషన్ పూర్తచేశామని తెలిపారు. 4 లక్షల మంది మొదటి సంవత్సరంలో పరీక్షలు రాసారు. రెండో సంవత్సరంలో 3లక్షల మంది పరీక్షలు రాసారు. జనరల్లో 78 శాతం మంది పరీక్షలు పాస్ అయ్యారు. ఒకేషన్ లో 38 వేల మంది పరీక్షలు మొదటి సంవత్సరం రాసారు. 71 శాతం ఓకేషనల్‌లో పాస్ అయ్యారు.

  • 12 Apr 2024 10:58 AM (IST)

    ఏపీ ఇంటర్‌ రిజల్ట్స్‌.. ఎమర్జెన్సీ హెల్ప్‌ లైన్‌ నంబర్‌

    ఏపీ ఇంటర్‌ బోర్డు ఈ రోజు ఉదయం 11 గంటలకు ఫలితాలను వెల్లడించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొందరు విద్యార్ధులకు ఊహించని ఫలితాలు వస్తే తల్లిదండ్రులు, కాలేజీ యాజమన్యాలు విద్యార్ధులకు అండగా నిలిచి మనోధైర్యం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. ఆశించిన మార్కులు రాకపోయినా, ఒక వేళ ఫెయిల్‌ అయినా.. ఆందోళన చెందుతున్న విద్యార్ధులు ఒత్తిడి చెందుతున్నట్లు గమనిస్తే తల్లిదండ్రులు లేదా సన్నిహితులు హెల్ప్‌ లైన్‌ నంబర్లకు ఫోన్‌ చేయాలని అధికారులు సూచించారు.

  • 12 Apr 2024 10:41 AM (IST)

    మరికొద్ది నిమిషాల్లోనే ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదల..

    తాడేపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ చేతుల మీదుగా ఉదయం 11 గంటలకు ఇంటర్‌ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్న ఇంటర్‌ బోర్డు. కాగా ఈ ఏడాది 9.99 ల‌క్షల మంది విద్యార్థులు ఇంటర్‌ ప‌రీక్షలు రాసిన సంగతి తెలిసిందే.

  • 12 Apr 2024 10:37 AM (IST)

    ఉత్కంఠగా ఇంటర్ ఫలితాల కోసం విద్యార్ధుల ఎదురు చూపు..

    ఇంటర్మీడియట్ ఫలితాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల విద్యార్ధులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ ఫలితాలు ఏకకాలంలో వెలువడనున్నాయి.

  • 12 Apr 2024 10:32 AM (IST)

    ఏపీ ఇంటర్ ఫలితాల లింక్ ఇదే.. ఒక్క క్లిక్‌తో నేరుగా రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోవచ్చు

    ఏపీ ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితియ సంవత్సర ఫలితాలు విడుదలైన తర్వాత ఫలితాలను టీవీ9 తెలుగు. కామ్‌  అధికారిక వెబ్‌సైట్‌లో పలితాలను చెక్‌ చేసుకోవచ్చు. అలాగే  ఏపీ ఇంటర్ బోర్డ్ (BIEAP) అధికారిక వెబ్‌సైట్‌లలో bie.ap.gov.in, bieap.apcfss.in లో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.

  • 12 Apr 2024 10:27 AM (IST)

    ఏపీ ఇంటర్ ఫలితాల సమయం ఇదే..

    ఈ రోజు ఉదయం 11 గంటలకు తాడేపల్లిలో ఇంటర్‌ బోర్డు కార్యదర్శి విలేకరుల సమావేశం నిర్వహించి ఫలితలను ప్రకటించనున్నారు.

Published On - Apr 12,2024 10:14 AM

Follow us