AP Inter Exam Postponed: రేపు జరగాల్సిన ఏపీ ఇంటర్మీడియట్‌ పర్యావరణ విద్య పరీక్ష వాయిదా.. కొత్త తేదీ ఇదే

|

Feb 02, 2024 | 1:58 PM

ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ విషయాన్ని ఏపీ ఇంటర్‌ బోర్డు కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ సుబ్బారావు వెల్లడించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఫిబ్రవ‌రి 3వ తేదీన పర్యావరణ విద్య పరీక్ష జరగాల్సి ఉంది. అయితే ఈ పరీక్షను వాయిదా వాయిదా వేసినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

AP Inter Exam Postponed: రేపు జరగాల్సిన ఏపీ ఇంటర్మీడియట్‌ పర్యావరణ విద్య పరీక్ష వాయిదా.. కొత్త తేదీ ఇదే
BIEAP
Follow us on

అమరావతి, ఫిబ్రవరి 2: ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ విషయాన్ని ఏపీ ఇంటర్‌ బోర్డు కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ సుబ్బారావు వెల్లడించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఫిబ్రవ‌రి 3వ తేదీన పర్యావరణ విద్య పరీక్ష జరగాల్సి ఉంది. అయితే ఈ పరీక్షను ఫిబ్రవ‌రి 23కు వాయిదా వేశారు.  కాగా ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో నైతికత-మానవ విలువలు, పర్యావరణ విద్య పరీక్షలు ఇంటర్‌ బోర్డు నిర్వహిస్తుంది. ఈ పరీక్షల్లో విద్యార్ధులు తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో పోలీసు శాఖలో 15 వేల ఉద్యోగాలు భర్తీ

తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇందులో భాగంగా త్వరలోనే పోలీసు శాఖలో 15వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం రేవంత్‌ తెలిపారు. పోలీస్‌ ఉద్యోగాలతోపాటు వైద్య, ఆరోగ్యశాఖలోనూ మరికొన్ని ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ శాఖలో తాజాగా 6,956 మంది స్టాఫ్‌నర్సులు ఎంపికైన సంగతి తెలిసిందే. వారందరికీ హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో బుధవారం (జనవరి 31) ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సీఎం రేవంత్‌ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ మాట్లాడుతూ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను పూర్తిగా ప్రక్షాళన చేశామని అన్నారు. టీఎస్పీయస్సీకి కొత్త ఛైర్మన్‌, సభ్యులను నియమించామని అన్నారు. త్వరలోనే వివిధ శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు.

వైద్య, ఆరోగ్యశాఖలో మరో 5 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం: భట్టి

ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు. నిరుద్యోగుల కలలను నిజం చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. తెలంగాణలో ఉద్యోగాల నియామకాలపై కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన అన్నారు. ప్రస్తుతం భర్తీ చేసిన 6,956 మంది స్టాఫ్‌నర్సులతోపాటు త్వరలో వైద్య, ఆరోగ్యశాఖలో మరో అయిదువేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు మంత్రి భట్టి ప్రకటించారు. అందుకు రోస్టర్‌ విధానం అనుసరించామని అన్నారు. అందువల్లనే 46 శాతం ఉద్యోగాలు వెనుకబడిన వర్గాల వారికి, 31 శాతం ఎస్సీలకు, 13 శాతం ఎస్టీలకు దక్కాయని వివరించారు. ప్రశ్నపత్రం లీకులు, కోర్టుకేసులకు ఏమాత్రం తావీయకుండా నియామకాలను చేపడతామని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.