AP Industries Recruitment 2021: విజయవాడలోని డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనుంది. మినిస్టీరియల్ గ్రేడ్ సర్వీసెస్, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ విభాగాల్లో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను అవుట్ సోర్సింగ్ విధానంలో తీసుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఈ సంస్థలో ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తుచేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు..
* మొత్తం 23 ఖాళీలకు గాను జూనియర్ అసిస్టెంట్ (08), రికార్డ్ అసిస్టెంట్ (01), ఆఫీస్ సబార్డినేట్ (12), వాచ్‌మెన్ (01), స్వీపర్ (01) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా తెలుగులో చదవడం, రాయడం, ఐదో తరగతి, ఏడో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీతో పాటు కంప్యూటర్‌లో పరిజ్ఞానం ఉండాలి.
* అభ్యర్థుల వయసు 01-10-2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను ది డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్, మొదటి అంతస్తు, గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ బిల్డింగ్స్, ముత్యాలంపాడు, విజయవాడ, 520011 అడ్రస్‌కు అందించాలి.
* ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ. 12,000 నుంచి రూ. 15,000 వరకు చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 20-11-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి..
Also Read: Amit Shah: తిరుపతిలో అమిత్ షా మూడ్రోజుల పర్యటన ఖరారు.. కేంద్ర హోం మంత్రి పర్యటన వివరాలు
Post Office: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. పోస్టాఫీసు ద్వారా సంపాదించే అవకాశం..
Prabhas Fan: షాకింగ్ న్యూస్.. ప్రభాస్‌కి సూసైడ్ నోట్ పంపిన ఫ్యాన్.. వారే కారణమంటూ!