AP Current Affairs 2022: వైఎస్సార్ లైఫ్ టైం ఎచీవ్‌మెంట్ 2022 అవార్డులు ప్రకటించిన ఏపీ సర్కార్.. విజేతలు వీళ్లే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2022వ సంవత్సరానికి గానూ వైఎస్సార్ లైఫ్ టైం ఎచీవ్‌మెంట్, వైఎస్సార్ ఎచీవ్‌మెంట్ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో సామాన్యులుగా ఉన్న అసామాన్యులను గుర్తించి, వారిని ఎంపిక చేశారు. 2022 సంవత్సరం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2022వ సంవత్సరానికి గానూ వైఎస్సార్ లైఫ్ టైం ఎచీవ్‌మెంట్, వైఎస్సార్ ఎచీవ్‌మెంట్ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో సామాన్యులుగా ఉన్న అసామాన్యులను గుర్తించి, వారిని ఎంపిక చేశారు. 2021 సంవత్సరం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నవంబరు 1న తొలిసారి 62 సంస్థలకు ఈ అవార్డులను ప్రధానం చేశారు. ఇక ఈ ఏడాది కూడా నవంబర్ 1న ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ అత్యున్నత పురస్కారాలను ప్రదానం చేస్తోంది. మన గ్రామం, మన వ్యవసాయం, మన కళలు, సాహిత్యం, సంస్కృతి–సంప్రదాయాలు, సమాజ సంక్షేమం–అభివృద్ధి… వంటి రంగాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులు/సంస్థలకు 2022 నవంబరు 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మొత్తంగా 30 అవార్డులను అందించనున్నారు. వీటిల్లో 20… జీవిత సాఫల్య పురస్కారాలు (లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్ అవార్డులు), 10… సాఫల్య పురస్కారాలు (ఎచీవ్‌మెంట్ అవార్డులు) ఉన్నాయి.
అన్నమయ్య మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ – జయబ్బనాయుడు, తలుపల గ్రామం, పీలేరు మండలం, అన్నమయ్య జిల్లాకు;
అమృత ఫల ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ –కె.ఎల్.ఎన్. మౌక్తిక, సబ్బవరం, అనకాపల్లి జిల్లాకు
కట్టమంచి బాలకృష్ణారెడ్డి, కట్టమంచి గ్రామం, చిత్తూరు జిల్లాకు… కమిటీ సమాలోచనల తరవాత తుది జాబితాగా ప్రతిపాదించటం జరిగింది.
– వీరందరికీ వైఎస్సార్ ఎచీవ్‌మెంట్ అవార్డులు ప్రకటించారు.
బడుగు బలహీన వర్గాల కోసం, గ్రామం కోసం, పేదల కోసం… నిరంతరం తపించి జీవితాన్ని అర్పించిన ఆర్. నారాయణమూర్తికి
సుప్రసిద్ధ రంగస్థల కళాకారుడు నాయుడు గోపీ…
మన కలంకారీ… పెడన నేతన్న పిచుక శ్రీనివాస్‌కు
దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ఉదయగిరి ఉడెన్ కట్లరీ… అంటే వంటింట్లో వాడే చెక్క వస్తువుల తయారీలో శ్రీమతి షేక్ గౌసియా బేగం గారికి… వైఎస్సార్ ఎచీవ్‌మెంట్ అవార్డులను ప్రకటించారు.
సాహిత్య సేవలో…
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
ఎమెస్కో ప్రచురణాలయానికి…
రచయిత డాక్టర్ శాంతి నారాయణ…
వారి సేవలకు జీవిత కాల సాఫల్య పురస్కారాలను ప్రకటించారు.
మహిళా సాధికారత–రక్షణ విభాగంలో…
ప్రజ్వలా ఫౌండేషన్– సునీతా కృష్ణన్…
ఉయ్యూరుకు చెందిన శిరీషా రిహేబిలిటేషన్ సెంటర్…
దిశ–పోలీసింగ్‌కు వైఎస్సార్ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్ అవార్డు ప్రకటించారు. నేరం జరగక ముందు, జరుగుతోందనే సమాచారం అందిన వెంటనే బాదితులను ఆదుకునే వ్యవస్థగా రాష్ట్ర సర్కార్ దిశ యాప్ తీసుకొచ్చింది.
– దిశ యాప్‌ద్వారా వచ్చిన ఎస్‌వోఎస్‌ను అందుకున్న వెంటనే నిమిషాల్లోనే సంఘటన స్థలానికి చేరుకుని కాపాడిన అయిదుగురు పోలీసులకు ఈ ఏడాది వైఎస్సార్ ఎచీవ్‌మెంట్ అవార్డును ఉమ్మడిగా ప్రకటించారు.
– రవాడ జయంతి; ఎస్‌వీవీ లక్ష్మీనారాయణ; రాయుడు సుబ్రహ్మణ్యం, హజ్రతయ్య; పి.శ్రీనివాసులు… వీరికి సంయుక్తంగా వైఎస్సార్ ఎచీవ్‌మెంట్ అవార్డుకు ఎంపిక చేశారు.
విద్యా రంగం నుంచి…
మదనపల్లి – రిషీ వేలీ విద్యా సంస్థకు
కావలి– జవహర్ భారతి విద్యా సంస్థకు.. ఈ రెండు విద్యా సంస్థలకు వైఎస్సార్ లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్ అవార్డు ప్రకటించారు.
అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన గ్రంధి మల్లికార్జునరావుగారికి… వైఎస్సార్ లైఫ్ టైం ఎచీవ్‌మెంట్ అవార్డు ప్రకటించారు.
రంగాల వారీగా చూస్తే...
వ్యవసాయానికి 5; సంస్కృతి–సంప్రదాయాలకు 5; మహిళా సాధికారత, రక్షణకు 3; తెలుగు భాషకు 3; విద్యా రంగానికి 4; మీడియా నుంచి 4; వైద్య రంగానికి 5; పరిశ్రమకు 1 అవార్డు ఇవ్వనున్నట్లు శుక్రవారం జరిగిన ప్రెస్‌మీట్‌లో సమాచార శాఖ కమిషనర్ టి. విజయకుమార్ రెడ్డి వెల్లడించారు.