AP EMRS Recruitment 2022: నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో భారీగా టీచింగ్‌ ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా..

|

Aug 14, 2022 | 8:54 AM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిధిలోని నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లలో.. ఒప్పంద ప్రాతిపదికన 52 ప్రిన్సిపల్‌, వైస్‌ ప్రిన్సిపల్‌, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌, మ్యూజిక్‌, ఆర్ట్‌, స్పెషల్ ఎడ్యుకేటర్‌ తదితర పోస్టుల..

AP EMRS Recruitment 2022: నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో భారీగా టీచింగ్‌ ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా..
Andhra Pradesh
Follow us on

AP EMR School Guest Teacher Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిధిలోని నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లలో.. ఒప్పంద ప్రాతిపదికన 52 ప్రిన్సిపల్‌, వైస్‌ ప్రిన్సిపల్‌, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌, మ్యూజిక్‌, ఆర్ట్‌, స్పెషల్ ఎడ్యుకేటర్‌ తదితర పోస్టుల (Teacher Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఏపీ స్టేట్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇంగ్లిష్, హిందీ, తెలుగు, గణితం, సైన్స్, సోషల్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, బోటనీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో ఖాళీలున్నాయి. సంబంధిత స్పెషలేజేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, బీఈడీలో ఉత్తీర్ణతతోపాటు సీటెట్‌/టెట్‌లో అర్హత సాధించి ఉండాలి. వయసు 21 నుంచి 60 యేళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆగస్టు 18, 2022వ తేదీలోపు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అకడమిక్‌ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది.
అర్హత సాధించిన వారికి నెలకు రూ.36000ల నుంచి రూ.45000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

టీచింగ్‌ పోస్టులు:

  • ప్రిన్సిపాల్ పోస్టులు: 1
  • వైస్ ప్రిన్సిపాల్ : 1
  • PGT పోస్టులు: 12
  • TGT పోస్టులు: 12
  • లైబ్రేరియన్ పోస్టులు: 1
  • ఆర్ట్ టీచర్ పోస్టులు: 1
  • మ్యూజిక్‌ టీచర్‌ పోస్టులు: 1
  • ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులు: 2
  • స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులు: 1
  • స్టూడెంట్ కౌన్సెలర్ పోస్టులు: 2
  • ఎడ్యుకేషనల్‌ అండ్‌ వొకేషనల్‌ గైడెన్స్‌ పోస్టులు: 2

నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ పోస్టులు:

ఇవి కూడా చదవండి
  • ఆఫీస్‌ సూపరింటెండెంట్ పోస్టులు: 1
  • అకౌంటెంట్ పోస్టులు: 1
  • సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు: 1
  • జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు: 3
  • ల్యాబ్‌ అసిస్టెంట్‌ పోస్టులు: 3
  • టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు: 1
  • హోటల్ వార్డెన్ పోస్టులు: 2
  • కేర్ టేకర్ పోస్టులు: 2
  • మెడికల్ అటెండెంట్ పోస్టులు: 2

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.