ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని దాదాపు 28 ఏకలవ్య మోడల్ గురుకులాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అలాగే 7,8,9 తరగతుల్లో మిగిలిపోయిన సీట్లలో ప్రవేశాలు కూడా కల్పిస్తారు. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్ధులను ఎంపిక చేస్తారు. ఆరో తరగతిలో ప్రవేశాలు పొందగోరే విద్యార్ధులు 2023-23 విద్యాసంవత్సరంలో ఐదో తరగతి, 7,8,9 తరగతుల్లో ప్రవేశాలకు వరుసగా 6,7,8 తరగతుల్లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. విద్యార్ధుల వయసు మార్చి 31, 2023 నాటికి అరో తరగతికి 10 నుంచి 13 ఏళ్లు, ఏడో తరగతికి 11 నుంచి 14 ఏళ్లు, 8వ తరగతికి 12 నుంచి 15 ఏళ్లు, 9వ తరగతికి 13 నుంచి16 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. అలాగే విద్యార్ధుల వార్షిక ఆదాయం రూ.లక్షకు మించకుండా ఉండాలి.
అర్హులైన గిరిజన, ఆదివాసి గిరిజన, సంచార గిరిజన తదితర కేటగిరీలకు చెందిన విద్యార్థులు ఎవరైనా ఏప్రిల్ 15, 2023వ తేదీలోగా ఆన్‌లైన్‌లో విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 30న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత వసతి, ఇంగ్లిష్ మీడియంలో సీబీఎస్‌ఈ సిలబస్ విద్యతోపాటు పుస్తకాలు, యూనీఫాం, ప్రతినెలా స్టైపెండ్ అందిస్తారు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
అధికారిక వెబ్‌సైట్ కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.