AP Pharmacy Admissions: బీ-ఫార్మసీ ప్రవేశాలకు ఏపీఈసెట్‌ 2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే

|

Sep 19, 2024 | 6:35 AM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి బీ-ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు కోసం ఏపీఈసెట్‌-2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ని ఏపీఈసెట్‌ కన్వీనర్‌ జి గణేష్‌కుమార్‌ విడుదల చేశారు. తాజా షెడ్యూల్‌ ప్రకారం.. బీ ఫార్మసీ కౌన్సెలింగ్‌కు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌..

AP Pharmacy Admissions: బీ-ఫార్మసీ ప్రవేశాలకు ఏపీఈసెట్‌ 2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే
Pharmacy Admissions
Follow us on

అమరావతి, సెప్టెంబర్‌ 19: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి బీ-ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు కోసం ఏపీఈసెట్‌-2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ని ఏపీఈసెట్‌ కన్వీనర్‌ జి గణేష్‌కుమార్‌ విడుదల చేశారు. తాజా షెడ్యూల్‌ ప్రకారం.. బీ ఫార్మసీ కౌన్సెలింగ్‌కు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ సెప్టెంబర్‌ 20, 21 తేదీల్లో జరుగుతుంది. ద్రువపత్రాల పరిశీలన సెప్టెంబర్‌ 21, 22 తేదీలో నిర్వహిస్తారు. సెప్టెంబర్‌ 23న ఐచ్ఛికాల మార్పుకు అవకాశం ఇస్తారు. సెప్టెంబర్‌ 25వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ చూడాలని ఆయన సూచించారు.

ఏపీ ఈసెట్ -2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ వివరాలు..

  • ఏపీ ఈసెట్ -2024 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ తేదీలు: సెప్టెంబర్‌ 20, 21, 2024.
  • ధ్రువపత్రాల పరిశీలన తేదీలు: సెప్టెంబర్‌ 21, 22, 2024.
  • ఐచ్ఛికాల మార్పు తేదీ: సెప్టెంబర్‌ 23, 2024.
  • సీట్ల కేటాయింపు తేదీ: సెప్టెంబర్‌ 25, 2024.

సెప్టెంబర్‌ 26 నుంచి తెలంగాణ పీజీ లాసెట్‌కు వెబ్‌ ఆప్షన్లు

తెలంగాణ పీజీ లాసెట్‌ 2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను అధికారులు స్వల్పంగా సవరించారు. ఎల్‌ఎల్‌ఎం కోర్సులో ప్రవేశానికి సెప్టెంబరు 24వ తేదీ వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. సెప్టెంబరు 26, 27 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవల్సి ఉంటుంది. సెప్టెంబరు 30వ తేదీన తొలి విడత సీట్లను కేటాయిస్తామని ప్రవేశాల కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పి రమేష్‌బాబు తెలిపారు. ఎల్‌ఎల్‌బీ బ్యాక్‌లాగ్‌ పరీక్షల ఫలితాలు వెలువడకపోవడం వల్లనే కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు చేశారు. ఈ మేరకు అభ్యర్ధులు గమనించాలని సూచించారు.

తెలంగాణ బీఈడీ, ఎంఈడీ పరీక్షల రుసుం గడువు ఇదే

శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించే బీఈడీ, ఎంఈడీ సెమిస్టర్‌ పరీక్షల రుసుం చెల్లించటానికి సెప్టెంబరు 24 వరకు గడువు ఇస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా శ్రీరంగప్రసాద్‌ ఓ ప్రకటనలో తెలిపారు. బీఈడీ ద్వితీయ సెమిస్టర్, ఎంఈడీ ద్వితీయ, నాలుగో సెమిస్టర్‌లకు ఈ నెల 24వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. ఆలస్య రుసుంతో అక్టోబరు 1 వరకు గడువు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.