AP EAPCET 2022 Exam: ఆంధ్రప్రదేశ్‌ ఎంసెట్-2022 హాల్‌ టికెట్లు విడుదల

|

Jun 28, 2022 | 4:06 PM

ఏపీ ఇంజినీరింగ్‌ అగ్రికల్చర్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (AP EAPCET 2022) హాల్‌ టికెట్లు సోమవారం (జూన్‌ 27) విడుదలయ్యాయి. ఏపీ ఈఏపీసెట్‌ 2022కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌..

AP EAPCET 2022 Exam: ఆంధ్రప్రదేశ్‌ ఎంసెట్-2022 హాల్‌ టికెట్లు విడుదల
Ap Eapcet 2022
Follow us on

AP EAPCET 2022 Hall Tickets Download: ఏపీ ఇంజినీరింగ్‌ అగ్రికల్చర్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (AP EAPCET 2022) హాల్‌ టికెట్లు సోమవారం (జూన్‌ 27) విడుదలయ్యాయి. ఏపీ ఈఏపీసెట్‌ 2022కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌ cets.apsche.ap.gov.in. నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఏపీ ఈఏపీసెట్‌ 2022 ఇంజనీరింగ్‌ విభాగానికి సంబంధించిన పరీక్ష జులై 4, 5, 6, 7, 8 తేదీల్లో మొత్తం 5 రోజుల్లో జరగనుంది. ఆన్‌లైన్‌ విధానంలో రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు జరుగుతాయి. అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాలకు సంబంధించిన పరీక్షలు జులై 11, 12 తేదీల్లో 4 సెషన్లలో జరగనున్నాయి. ఆయా పరీక్షల తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌ పరీక్ష, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్‌ పరీక్ష జరుగుతుంది.

AP EAPCET 2022 హాల్‌ టెకెట్లు ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే..

  • ముందుగా ఏపీ ఈఏపీసెట్‌ అధికారిక సైట్‌ cets.apsche.ap.gov.inని ఓపెన్‌ చెయ్యాలి.
  • హోమ్ పేజ్‌లో కనిపించే AP EAPCET 2022 Hall Tickets 2022 లింక్‌పై క్లిక్ చెయ్యాలి.
  • లాగిన్ వివరాలను నమోదు చేసి, సబ్‌మిట్‌పై క్లిక్ చెయ్యాలి.
  • వెంటనే అడ్మిట్ కార్డు స్క్రీన్‌పై ఓపెన్‌ అవుతుంది.
  • అడ్మిట్ కార్డులో మీ వివరాలను చెక్ చేసుకుని డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్‌ఔట్‌ తీసుకోవాలి.

ఏపీ ఈఏపీసెట్‌ 2022 క్వశ్యన్‌ పేపర్‌ ఇంగ్లిష్‌, తెలుగు మాధ్యమాల్లో ఉంటుంది. మొత్తం 160 ప్రశ్నలకు 180 నిముషాల పాటు పరీక్ష జరుగుతుంది. ఆగస్టు 15 తర్వాత ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఎగ్జాం ప్యాట్రన్‌, ర్యాంకుల విధానంలో ఎటువంటి మార్పులులేవని, గత ఏడాది మాదిరిగానే ఉంటుందని, సెప్టెంబర్‌ రెండో వారంలోగా తరగతులు ప్రారంభించేందుకు అనుగుణంగా షెడ్యూల్‌ తయారు చేసినట్లు ఏపీ విద్యాశాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా బీఈ, బీటెక్‌, బీటెక్‌ (బయోటెక్‌), బీటెక్‌ (డైరీ టెక్నాలజీ), బీటెక్‌ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్), బీఫార్మసీ, బీటెక్‌ (ఫుడ్ టెక్నాలజీ), బీఎస్సీ (ఆనర్స్‌) అగ్రికల్చర్, బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్, బీఎస్సీ ఫారెస్ట్రీ, బీవీఎస్సీ, ఏహెచ్‌, బీఎఫ్‌ఎస్సీ, Pharm-D కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.