AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP CRDA Jobs 2025: నిరుద్యోగులకు అలర్ట్.. ఆంధ్రప్రదేశ్‌ CRDAలో ఉద్యోగాలకు 2 నోటిఫికేషన్లు విడుదల

రాష్ట్ర సీఆర్‌డీఏలో.. కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈమేరకు ఏపీ సీఆర్‌డీఏలో రెండు నోటిఫికేషన్లను విడుదల చేసింది. అమరావతిలో జరుగుతున్న రాజధాని నిర్మాణ పనులను పర్యవేక్షణకు పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు..

AP CRDA Jobs 2025: నిరుద్యోగులకు అలర్ట్.. ఆంధ్రప్రదేశ్‌ CRDAలో ఉద్యోగాలకు 2 నోటిఫికేషన్లు విడుదల
Andhra Pradesh CRDA Jobs
Srilakshmi C
|

Updated on: Sep 14, 2025 | 4:32 PM

Share

అమరావతి, సెప్టెంబర్‌ 14: ఆంధ్రప్రదేశ్‌లోని సీఆర్‌డీఏలో.. కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈమేరకు ఏపీ సీఆర్‌డీఏలో రెండు నోటిఫికేషన్లను విడుదల చేసింది. అమరావతిలో జరుగుతున్న రాజధాని నిర్మాణ పనులను పర్యవేక్షణకు పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఇందులో చీఫ్ ఇంజినీర్ పోస్టులు 4, సూపరింటెండింగ్ ఇంజినీర్ పోస్టులు 8, ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు పోస్టులు 15. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌ పోస్టులు 25, సహాయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు/అసిస్టెంట్ ఇంజినీర్‌ పోస్టులు 50, సీనియర్ ఫైర్ సేఫ్టీ ఎక్స్‌పర్ట్ పోస్టులు 2, జూనియర్ ఫైర్ సేఫ్టీ ఎక్స్‌పర్ట్ పోస్టులు 4 ఉన్నాయి.

అలాగే సీనియర్ ఎలక్ట్రికల్/ ఈఎల్‌యూ ఎక్స్‌పర్ట్ పోస్టులు 2, జూనియర్ ఎలక్ట్రికల్/ఈఎలయూ ఎక్స్‌పర్ట్ పోస్టులు 6, సీనియర్ ఎక్స్‌పర్ట్ పోస్టులు 2, జూనియర్ ప్లంబింగ్ ఎక్స్పర్ట్ పోస్టులు 6, సీనియర్ హెచ్‌వీఏసీ ఎక్స్‌పర్ట్ పోస్టులు 2, జూనియర్ హెచ్వీఏసీ ఎక్స్‌పర్ట్ పోస్టులు 6 వరకు ఉన్నాయి. మొత్తం 132 వరకు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులన్నింటినీ ఒప్పంద పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఇతర సమాచారం కోసం ఏపీ సీఆర్‌డీఏ అధికారిక వెబ్‌సైట్ లోని కెరీర్స్ విభాగంలో చెక్‌ చేసుకోవాలని ఏపీసీఆర్‌డీఏ కమిషనర్ సూచించారు.

తెలంగాణ నీట్‌-పీజీ 2025 రాష్ట్ర ర్యాంకర్ల జాబితా విడుదల

నీట్‌ పీజీలో అర్హత సాధించిన మొత్తం 7,179 మంది తెలంగాణ పీజీ ర్యాంకర్ల జాబితాను కాళోజీ వర్సిటీ తాజాగా విడుదల చేసింది. నీట్‌ పీజీలో జాతీయ స్థాయిలో సురవరం రిత్విక్‌ రెడ్డి 16వ ర్యాంకు సాధించగా.. రాష్ట్రంలో పీజీ మొదటి ర్యాంకర్‌గా నిలిచాడు. కాయతి రోహన్‌రెడ్డి 22వ ర్యాంక్‌, గద్దె అలేఖ్య 43 ర్యాంక్‌, గంగం సిరిచందన 90వ ర్యాంక్‌, పుట్ట కార్తీక్‌ 103వ ర్యాంక్‌లు జాతీయ స్థాయిలో సాధించగా.. వీరు రాష్ట్ర ర్యాంకర్లలో వరుసగా 2, 3, 4, 5 స్థానాల్లో నిలిచారు. మొదటి 5 ర్యాంకులు ముగ్గురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలకు దక్కాయి. అభ్యంతరాల స్వీకరణ అనంతరం పీజీ కౌన్సెలింగ్‌ రాష్ట్ర కోటా ప్రక్రియ ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి

తెలంగాణ నీట్‌ పీజీ 2025 రాష్ట్ర ర్యాంకర్ల లిస్ట్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్