AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Curd: వానాకాలంలో పెరుగు తినే వాళ్లు.. ఈ విషయం కచ్చితంగా తెలుసుకోండి.. లేదంటే తిప్పలే!

పెరుగు తినడం అంటే చాలా మందికి ఇష్టం. ఎంత తిన్నా.. చివరకు పెరుగుతో తినకపోతే భోజనం చేసినట్టే ఉండదని చాలా మంది అంటారు. అయితే వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల జలుబు చేస్తుందని, అందుకే వానాకాంలో పెరుగుకు దూరంగా ఉండాలని అంటారు. అసలు ఇందులో నిజమెంత వర్షాకాలంలో పెరుగు తినడం మంచిదేనా? పెరుగు తినేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

Curd: వానాకాలంలో పెరుగు తినే వాళ్లు.. ఈ విషయం కచ్చితంగా తెలుసుకోండి.. లేదంటే తిప్పలే!
Yogurt In Monsoon
Anand T
|

Updated on: Aug 06, 2026 | 7:00 AM

Share

సాధారణంగా వర్షాకాలంలో వాతావరణంలో తేమ, చల్లదనం కారణంగా మన జీర్ణశక్తి మందగిస్తుంది. ఇలాంటప్పుడు చల్లగా, గట్టిగా ఉండే పెరుగు తినడం వలన జీర్ణసమస్యలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదం ప్రకారం పెరుగు అనేది శరీరంలో స్రావాలను పెంచే గుణాన్ని కలిగి ఉంటుంది. వర్షాకాలంలో ఇది కఫం, జలుబు, గొంతు నొప్పిని పెంచే అవకాశం ఉంది. అలాగే వర్షాకాలంలో బ్యాక్టీరియా త్వరగా వ్యాప్తి చెందడం వల్ల పెరుగు త్వరగా పులిసిపోయి కడుపు రుగ్మతలకు దారితీయవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి జీర్ణ సమస్యలు ఉన్న వారు పెరుగు తినే ముందు వైద్యులను సంప్రదించండం మంచిదని సూచిస్తున్నారు.

వర్షాకాలంలో పెరుగు తినేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

రాత్రి పూట వద్దు: వర్షాకాలంలో రాత్రి వేళల్లో పెరుగు తినడం తగ్గించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా తినడం వల్ల కఫం, జీర్ణ సమస్యలు పెరుగే ఛాన్స్ ఉందని.. కాబట్టి కేవలం మధ్యాహ్న భోజనంలో మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు.

చల్లగా తినకూడదు: చాలా మంది చల్లటి పెరుగు తినే అలావాటు ఉంటుంది. కానీ ఈ అలవాటు మంచి కాదు.. ఫ్రిజ్ నుండి తీసిన వెంటనే కాకుండా .. పెరుగు సాధారణ గది ఉష్ణోగ్రతకు వచ్చిన తర్వాతే తినాలని నిపుణులను సూచిస్తున్నారు.

మజ్జిగగా మార్చండి: వర్షాకాలంలో పెరుగును నేరుగా తినడం కన్నా.. నీళ్లు కలిపి మజ్జిగలా లేదా పసుపు, అల్లం కలిపి మజ్జిగ పులుసుగా చేసుకొని తినడం మంచిదని చెబుతున్నారు.

తాజాదనం: వర్షాకాలంలో ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉండే పెరును మాత్రమే తినాలని నిపుణులు అంటున్నారు. ఎక్కువ రోజులు నిల్వ ఉన్న, బాగా పులిసిన పెరుగును తినవద్దని అంటున్నారు.

సుగంధ ద్రవ్యాలు కలపండి: అలాగే పెరుగు చల్లదనాన్ని తగ్గించడానికి, జీర్ణం సులభమవ్వడానికి కొద్దిగా మిరియాల పొడి, జీలకర్ర పొడి లేదా అల్లం కలిపి తీసుకోవాలని సూచిస్తున్నారు.

పెరుగు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

అయితే పెరుగు తినడం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పెరుగులోని ప్రోబయోటిక్స్ పేగుల ఆరోగ్యాన్ని కాపాడి గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తాయి. అలాగే శరీర రోగనిరోధక వ్యవస్థను బలపరిచి ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి. అంతేకాదు పెరుగులో ఉండే క్యాల్షియం, ఫాస్ఫరస్ ఎముకలు, పళ్ళును బలంగా ఉంచుతాయి. ఇందులో ఎక్కవ ప్రొటీన్, తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల బరువు తగ్గాలి అనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us