AP LAWCET Results: విడుదలైన ఏపీ లా సెట్‌ ఫలితాలు.. ఇలా చెక్‌ చేసుకోండి.. స్టెప్‌ బై స్టెప్‌ వివరాలు..

AP LAWCET 2021 Results: ఆంధ్రప్రదేశ్‌లోని న్యాయ కళాశాలల్లో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ లాసెట్‌–2021 ఫలితాలను..

AP LAWCET Results: విడుదలైన ఏపీ లా సెట్‌ ఫలితాలు.. ఇలా చెక్‌ చేసుకోండి.. స్టెప్‌ బై స్టెప్‌ వివరాలు..
Ap Lawcet Results

Edited By: Ravi Kiran

Updated on: Oct 22, 2021 | 7:27 PM

AP LAWCET 2021 Results: ఆంధ్రప్రదేశ్‌లోని న్యాయ కళాశాలల్లో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ లాసెట్‌–2021 ఫలితాలను గురువారం అధికారులు విడుదల చేశారు. ఐదేళ్ల న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్షలో 92.21 శాతం ఉత్తీర్ణత సాధించగా.. మూడేళ్ల లా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్షలో 1,991 మంది అర్హతసాధించారు.

ఇదిలా ఉంటే కరోనా అన్ని రకాల పరీక్షలపై ప్రభావం చూపినట్లే లా సెట్‌ పరీక్ష నిర్వహణపై ప్రభావం పడింది. కరోనా కారణంగా పరీక్షల నిర్వహణల్లో జాప్యం జరిగింది. అయితే కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత ఎట్టకేలకు ప్రభుత్వం పరీక్షలను సెప్టెంబర్‌ 22న నిర్వహించింది. ఇక త్వరలోనే లాసెట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించి సీట్ల భర్తీ చేయనున్నామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్ర రెడ్డి తెలిపారు.

ఫలితాలు ఇలా చెక్‌ చేసుకోండి..

* అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ sche.ap.gov.inలోకి వెళ్లాలి.

* అనంతరం హోమ్‌పేజీలో ఉండే AP LAWCET/ PGLCET రిజల్ట్‌ లింక్‌ను క్లిక్‌ చేయాలి..

* తర్వాత రిజిస్ట్రేషన్‌ నెంబర్‌, హాల్‌ టికెట్‌ను ఎంటర్‌ చేయాలి.

* వెంటనే ఫలితాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి.

* భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఫలితాల పేజీని డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

Also Read: Jio Phone Next: దీపావళికి రానున్న అత్యంత చౌకైన జియో స్మార్ట్‌ ఫోన్‌.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయో తెలుసా.?

మంగళవారం ఏపీలో రైతు భరోసా రెండో విడత సాయం

Business Idea: తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేయాలనుకుంటున్నారా.. అదిరిపోయే బిజినెస్ ప్లాన్ మీకోసం..