AOC Recruitment 2022: నిరుద్యోగులకు తీపికబురు! సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ 419 ఉద్యోగాలు..

|

Oct 28, 2022 | 7:41 AM

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ వివిధ రీజియన్లలో ఖాళీగా ఉన్న.. 419 మెటీరియల్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

AOC Recruitment 2022: నిరుద్యోగులకు తీపికబురు! సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ 419 ఉద్యోగాలు..
AOC Secunderabad Recruitment 2022
Follow us on

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ వివిధ రీజియన్లలో ఖాళీగా ఉన్న.. 419 మెటీరియల్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ సెంట్రల్ రిక్రూట్‌మెంట్ సెల్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు గ్రాడ్యుయేషన్‌/డిప్లొమా ఇంజనీరింగ్‌/డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా18 నుంచి 27 యేళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు వర్తిస్తుంది. ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్‌ విధానంలో నోటిఫికేషన్‌ విడుదలైన 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌ అక్టోబర్‌ 27వ తేదీన విడుదలైంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ నవంబర్‌ 7వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్, ఫిజికల్ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.29,200ల నుంచి రూ.92,300ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

రీజియన్ల వారీగా ఖాళీల వివరాలు..

ఈస్ట్రన్‌- 10, వెస్ట్రన్‌- 120, నార్తెర్న్‌- 23, సదరన్‌- 32, సౌత్ వెస్ట్రన్- 23, సెంట్రల్ వెస్ట్- 185, సెంట్రల్ ఈస్ట్- 26 ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

రాత పరీక్ష విధానం..

రాత పరీక్ష మొత్తం 150 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలకు, 150 మార్కులకు గానూ రెండు గంటల సమయంలో జరుగుతుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 చొప్పున నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

  • జనరల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగంలో 50 ప్రశ్నలకు 50 మార్కులు
  • న్యూమరిక్‌ ఆప్టిట్యూడ్‌ విభాగంలో 25 ప్రశ్నలకు 25 మార్కులు
  • జనరల్ అవేర్‌నెస్ విభాగంలో 25 ప్రశ్నలకు 25 మార్కులు
  • ఇంగ్లిష్‌ ల్యాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌ విభాగంలో 50 ప్రశ్నలకు 50 మార్కులు

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.