Annual Exams: ఆ ఆలోచన లేదు.. పరీక్షలు లేకుండా కష్టం.. తెలంగాణ ఇంటర్‌ బోర్డు

Telangana Intermediate Board: అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు

Annual Exams: ఆ ఆలోచన లేదు.. పరీక్షలు లేకుండా కష్టం.. తెలంగాణ ఇంటర్‌ బోర్డు
NEET PG 2021

Updated on: Mar 27, 2021 | 5:55 PM

Telangana Intermediate Board: అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటూ ఆంక్షలు కూడా విధించాయి. తెలంగాణలో కూడా కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా విద్యాసంస్థల్లో కేసులు ఎక్కువగా పెరుగుతుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యాసంస్థలన్నింటినీ మూసివేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో రాష్ట్రమంతటా పలు చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. విద్యా సంస్థలను కొనసాగించాలంటూ పలు చోట్ల ఆందోళనలు సైతం నిర్వహించారు. అయితే విద్యాసంస్థలపై నిర్ణయం తీసుకున్నప్పటికీ.. ఇంటర్‌ పరీక్షలపై ఇంకా ఉత్కంఠ నెలకొంది. దీనిపై ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో జాగ్రత్త చర్యలు తీసుకుంటూ వార్షిక పరీక్షలు నిర్వహించాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది. పరీక్షలు లేకుండా విద్యార్థులను పాస్‌ చేసే ఆలోచన ఇంటర్‌ బోర్డుకు లేదంటూ అధికారులు పేర్కొంటున్నారు. దీనిపై తొందర్లోనే ఆలోచన తీసుకుంటామని.. అనంతరం వెంటనే హాల్‌టికెట్లు జారీ చేయనున్నట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయం వెల్లడించింది. కాగా.. మొదటి సంవత్సరం విద్యార్థులకు పర్యావరణం, నైతిక విలువల పరీక్షలను అసైన్‌మెంట్‌ రూపంలో నిర్వహించాలని బోర్డు అధికారులు భావిస్తున్నారు. అయితే.. ఈ పరీక్షలను ఏప్రిల్‌ 1, 3 తేదీల్లో నిర్వహించనున్నారు. ఇదిలాఉంటే.. ఏప్రిల్‌ 7 నుంచి జరిగే ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు వాయిదా పడే అవకాశమున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

Also Read: