Job Notification: ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. సీఆర్డీఏ పరిధిలో 12న భారీ జాబ్‌ మేళ..రూ.38 వేల వరకు వేతనం

|

Apr 12, 2021 | 4:55 AM

Andhrapradesh Jobs: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో మరో ఉద్యోగ ప్రకటన వెలువడింది. పలు కంపెనీల్లోని ఉద్యోగాల భర్తీకి ఈ నెల 12 (సోమవారం) సీఆర్డీఏ...

Job Notification: ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. సీఆర్డీఏ పరిధిలో 12న భారీ జాబ్‌ మేళ..రూ.38 వేల వరకు వేతనం
Job Notification
Follow us on

Andhrapradesh Jobs: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో మరో ఉద్యోగ ప్రకటన వెలువడింది. పలు కంపెనీల్లోని ఉద్యోగాల భర్తీకి ఈ నెల 12 (సోమవారం) సీఆర్డీఏ పరిధిలోని రాయపాటి హైట్స్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు సంస్థ తెలిపింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు సోమమవారం ఉదయం 10 గంటలకు నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. అయితే ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పని చేయాల్సి ఉంటుందని తెలిపింది.

ఉద్యోగ ఖాళీల వివరాలు

ఈ సంస్థలో ప్రమోటర్‌ విభాగంలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ చదివిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. అభ్యర్థులకు బైక్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌,స్మార్ట్‌ ఫోన్‌ తప్పనిసరిగా ఉండాలి. వయసు 19 నుంచి 30 ఏళ్ల వరకు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.14,500 నుంచి రూ.16,500 వరకు వేతనం చెల్లించనున్నారు. అలాగే రూ.4,700 వరకు ఇన్సెంటీవ్స్‌ అందిస్తారు. అయితే కేవలం పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు.

అలాగే అసోసియేట్స్‌ విభాగంలో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. పదో తరగతి పాస్‌ లేదా ఫెయిల్‌ అయినా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 35 ఏళ్ల వరకు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.10,683 వరకు వేతనం చెల్లించనున్నారు. పురుషులు, స్త్రీలు ఎవరైనా ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చు. అలాగే బ్రాంచ్ రిలేషన్ షిప్ మేనేజర్, బ్రాంచ్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటీవ్, రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటీవ్, యూనిట్ మేనేజర్ తదితర విభాగాల్లో కూడా ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చు. పదో తరగతి నుంచి పీజీ చేసిన వారకు ఈ ఉద్యోగాలకు అర్హులు. బ్రాంచ్ రిలేషన్ షిప్ మేనేజర్, యూనిట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులకు నాలుగేళ్లు, ఆరేళ్ల చొప్పున అనుభవం ఉండాలి. ఈ ఉద్యోగాలకు పోస్టుల ఆధారంగా రూ. 15 వేల నుంచి రూ. 38 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలకు నోటిఫికేషన్లో చూడాలని సంస్ తెలిపింది.

 

NEET PG 2021: మార్పుల్లేవు.. యథాతథంగా నీట్ పీజీ ప్రవేశ పరీక్ష.. కఠిన మార్గదర్శకాలు విడుదల

Railway BLW Recruitment: ఇండియన్‌ రైల్వే అప్రెంటిస్‌ పోస్టుల ఫలితాలు వచ్చేశాయ్‌.. ఇలా చెక్‌ చేసుకోండి..