AP Job Recruitment 2021: దేశంలో ప్రముఖ విద్యాసంస్థల్లో ఎన్‌ఐటీ ఒకటన్న విషయం అందరికి తెలిసిందే. ఇటీవల ఎన్‌ఐటీల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్ఐటీలో నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి అధికరులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఖాళీగా ఉన్న 15 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకుని కావాల్సిన ధ్రువపత్రాలను జత చేసి సూచించిన చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 15 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో రిజిస్టర్, లైబ్రేరియన్, ఎస్ఏఎస్ ఆఫీసర్, ఎస్ఏఎస్ అసిస్టెంట్, టెక్నీషియన్ విభాగాల్లో ఒక్కో పోస్టు ఉన్నాయి. ఇంకా జూనియర్ ఇంజనీర్ విభాగంలో రెండు పోస్టులు ఉన్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ విభాగాల్లో 4 ఖాళీలు ఉన్నాయి.
వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే నోటిఫికేషన్‌ను చూడాలి. వయో పరిమితి విషయానికి వస్తే రిజిస్టర్ పోస్టుకు 56 ఏళ్లు, లైబ్రేరియన్ పోస్టుకు 56, SAS ఆఫీసర్ ఉద్యోగానికి 35 ఏళ్లు, జైనియర్ ఇంజనీర్/ఎస్ఏఎస్ అసిస్టెంట్/లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 30 ఏళ్లు, టెక్నీషియన్ ఉద్యోగానికి 27 ఏళ్లు, సీనియర్ టెక్నీషియన్ ఉద్యోగానికి 33 ఏళ్లు, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి 27 ఏళ్లను వయోపరిమితిగా నిర్ణయించారు.
అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్లకు జూలై 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజుగా రూ. 1500ను నిర్ణయించారు. ఎస్సీ/ఎస్టీ/PWD అభ్యర్థులకు రూ. 500లను పరీక్ష ఫీజుగా నిర్ణయించారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని ప్రింట్ తీసుకోవాలి.
The Director, National Institute of Technology Andhra Pradesh, Kadakatla, Tadepalligudem – 534101, West Godavari, Andhra Pradesh, India’’ చిరునామాకు జులై 19లోగా చేరేలా పంపించాల్సి ఉంటుంది.