AP TET 2025 Exam Date: ఏపీ టెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులు నేటి నుంచే ప్రారంభం.. పూర్తి షెడ్యూల్‌ ఇదే

AP TET 2025 Schedule: టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) 2025 షెడ్యూల్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ మేరకు ఏపీ టెట్‌ షెడ్యూల్‌ను గురువారం (అక్టోబర్‌ 2025) విడుదల చేసింది. రెగ్యులర్‌ అభ్యర్థులతో పాటు ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు టెట్‌ రాసేందుకు అవకాశం కల్పిస్తూ తాజాగా సర్కార్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విద్యాశాఖ

AP TET 2025 Exam Date: ఏపీ టెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులు నేటి నుంచే ప్రారంభం.. పూర్తి షెడ్యూల్‌ ఇదే
AP TET 2025 Exam Schedule

Updated on: Oct 24, 2025 | 10:44 AM

అమరావతి, అక్టోబర్ 24: ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) 2025 షెడ్యూల్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ మేరకు ఏపీ టెట్‌ షెడ్యూల్‌ను గురువారం (అక్టోబర్‌ 2025) విడుదల చేసింది. రెగ్యులర్‌ అభ్యర్థులతో పాటు ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు టెట్‌ రాసేందుకు అవకాశం కల్పిస్తూ తాజాగా సర్కార్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విద్యాశాఖ చకచకా ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా టెట్‌ పరీక్షల షెడ్యూల్‌ను వెలువరించింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం టెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఈ రోజు నుంచి అంటే అక్టోబర్‌ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. నవంబర్‌ 23, 2025వ తేదీ వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు కొనసాగుతాయి. నవంబర్‌ 25న ఆన్‌లైన్‌ మాక్‌ టెస్ట్‌ నిర్వహిస్తారని, డిసెంబర్‌ 3 నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించింది.

ఏపీ టెట్‌ 2025 నోటిఫికేషన్‌, ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

డిసెంబర్‌ 10న 2 షిఫ్టుల్లో టెట్‌ ఆన్‌లైన్‌ రాత పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి 12 గంటలకు మొదటి షిఫ్ట్‌, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో షిఫ్ట్‌ పరీక్షలు జరుగుతాయని ఏపీ టెట్‌ కన్వీనర్‌ ఎంవీ కృష్ణారెడ్డి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక టెట్‌ ఫలితాలను జనవరి 19వ తేదీన వెల్లడిస్తామని చెప్పారు. ఈ మేరకు టెట్‌ పూర్తి నోటిఫికేషన్‌ శుక్రవారం (అక్టోబర్‌ 24) విద్యాశాఖ విడుదల చేయనుంది. ఇతర వివరాలకు హెల్ప్‌ డెస్క్‌ నంబర్లు 8121947387, 8125046997, 7995649286, 7995789286, 9963069286ను సంప్రదించాలని సూచించింది.

ఇవి కూడా చదవండి

కాగా నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ నిబంధనల మేరకు ఉపాధ్యాయులకు టెట్‌ తప్పనిసరని తేల్చింది. ఇదే అంశాన్ని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోనూ స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ, అన్ని మేనేజ్‌మెంట్‌ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధిస్తున్న ఉపాధ్యాయులకు తప్పనిసరిగా టెట్‌ పరీక్ష రాయవల్సి ఉంటుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ ఒకటో తేదీ నాటికి 5 ఏళ్లలోపు మాత్రమే సర్వీసు మిగిలి ఉన్నవారికి టెట్‌ నుంచి మినహాయింపు వర్తిస్తుంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.