AP TET 2024 Notification: నిరుద్యోగులకు శుభవార్త.. మరో 2 రోజుల్లో విడుదలకానున్న ఏపీ టెట్‌- 2024 నోటిఫికేషన్‌

|

Jan 28, 2024 | 7:07 AM

త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ మేరకు విద్యాశాఖ మార్గదర్శ కాలు జారీ చేసింది. దీంతో బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన అభ్యర్థులు ప్రిపరేషన్‌ సన్నాహాలు మొదలుపెడుతున్నారు. 2022, 2023 సంవత్సరాల్లో డీఈడీ, బీఈడీ పూర్తిచేసిన వారికి కూడా త్వరలో విడుదల చేయనున్న డీఎస్సీ నోటిఫికేషన్‌లో అవకాశం కల్పించాలన్న..

AP TET 2024 Notification: నిరుద్యోగులకు శుభవార్త.. మరో 2 రోజుల్లో విడుదలకానున్న ఏపీ టెట్‌- 2024 నోటిఫికేషన్‌
AP TET 2024 Notification Soon
Follow us on

అమరావతి, జనవరి 28: త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ మేరకు విద్యాశాఖ మార్గదర్శ కాలు జారీ చేసింది. దీంతో బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన అభ్యర్థులు ప్రిపరేషన్‌ సన్నాహాలు మొదలుపెడుతున్నారు. 2022, 2023 సంవత్సరాల్లో డీఈడీ, బీఈడీ పూర్తిచేసిన వారికి కూడా త్వరలో విడుదల చేయనున్న డీఎస్సీ నోటిఫికేషన్‌లో అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో టెట్‌ నిర్వహిస్తున్నట్లు సమాచారం. కాగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2022 ఆగస్టులో చివరిసారిగా టెట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారన్న సంగతి తెలిసిందే. నాడు టెట్‌కు దాదాపు 4.50 లక్షల మంది దరఖాస్తు చేసుకుకోగా.. పరీక్ష రాసిన వారిలో దాదాపు 2 లక్షల మంది అర్హత సాధించారు. ఈసారి సుమారు 5 లక్షల మంది టెట్‌ రాసే అవకాశం ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. టెట్‌ నిర్వహణకు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఒకట్రెండు రోజుల్లో టెట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.

‘టెట్‌’ అర్హత నిబంధనల్లో సడలింపు..

టెట్‌ నిర్వహణకు ఏర్పాట్లుచేస్తున్న పాఠశాల విద్యాశాఖ ఎక్కువ మంది అభ్యర్థులకు మేలు జరిగేలా నిబంధనలను సడలించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్ధులు టెట్‌ పేపర్‌ 2ఏ రాసేందుకు గతంలో డిగ్రీలో 50 శాతం మార్కులు తప్పనిసరన్న నిబంధన ఉండేది. అయితే దాన్ని సవరించి ఆ మార్కులను 40 శాతానికి తగ్గించింది. ఇతర వర్గాలకు మాత్రం గ్రాడ్యుయేషన్‌లో 50 మార్కులు తప్పనిసరి చేసింది. దీంతో ఏపీ టెట్‌ 2024 నోటిఫికేషన్‌కు అధిక మంది పోటీపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

పేపర్ 1 పరీక్షకు అదనపు కండీషన్‌

ఒకటి నుంచి ఐదో తరగతి బోధనకు ఉద్దేశించిన టెట్‌ పేపర్‌ 1 రాసే అభ్యర్థులకు గతంలో ఇంటర్మిడియట్‌లో 50 శాతం మార్కులతోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా లేదా 50 శాతం మార్కులతో ఇంటర్మిడియట్‌/సీనియర్‌ సెకండరీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దీంతోపాటు అదనంగా మరో నిబంధనను జోడించారు. అదేంటంటే.. కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మిడియట్‌తో పాటు రెండేళ్ల డిప్లొమా ఇన్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ పూర్తిచేయాలి. లేదంటే డిగ్రీ తర్వాత రెండేళ్ల డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ చేసిన వారు టెట్‌ పేపర్‌ 1 పరీక్ష రాసేందుకు అర్హులుగా పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు పాఠశాల విద్యాశాఖ ఐదు శాతం మార్కులు సడలింపు ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ సంబంధిత వార్తల కోసం క్లిక్‌ చేయండి.