AP TET 2024 Hall Tickets: ఏపీ టెట్‌కు భారీగా దరఖాస్తులు.. హాల్ టికెట్లు ఎప్పటి నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చంటే

|

Aug 04, 2024 | 2:02 PM

ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) 2024 దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 3వ తేదీతో ముగిసింది. ఇప్పటికే టెట్‌ దరఖాస్తు గడువు పొడిగించడం లేదని ఏపీ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ విజయరామరాజు కూడా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు విజయరామరాజు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. దీంతో అర్హులైన అభ్యర్ధులు ముగింపు సమయంలోపు దరఖాస్తు చేసుకున్నారు. ముగింపు సమయం నాటికి రెండు పేపర్లకు..

AP TET 2024 Hall Tickets: ఏపీ టెట్‌కు భారీగా దరఖాస్తులు.. హాల్ టికెట్లు ఎప్పటి నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చంటే
AP TET 2024
Follow us on

అమరావతి, ఆగస్టు 4: ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) 2024 దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 3వ తేదీతో ముగిసింది. ఇప్పటికే టెట్‌ దరఖాస్తు గడువు పొడిగించడం లేదని ఏపీ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ విజయరామరాజు కూడా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు విజయరామరాజు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. దీంతో అర్హులైన అభ్యర్ధులు ముగింపు సమయంలోపు దరఖాస్తు చేసుకున్నారు. ముగింపు సమయం నాటికి రెండు పేపర్లకు కలిపి టెట్ దరఖాస్తులు 3.20 లక్షల వరకు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం అభ్యర్ధులంతా ప్రిపరేషన్‌పై పూర్తి శ్రద్ధ పెట్టారు. పరీక్షకు మూడు నెలల గడువు ఇవ్వడంతో ఈ సమయాన్ని సద్వినియోగ పరచుకోవాలని అభ్యర్ధులు భావిస్తున్నారు. దీంతో గతంలో టెట్ స్కోర్ సాధించిన వారు ఈసారి మరింత స్కోర్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక కొత్తగా టెట్ రాస్తున్నవారు కూడా పోటాపోటీగా ప్రిపరేషన్‌ సాగిస్తున్నారు.

ఈసారి కూడా టెట్‌ ప‌రీక్ష సీబీటీ విధానంలో ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నట్లు ఇప్పటికే విద్యాశాఖ స్పష్టం చేసింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు ఆన్‌లైన్‌ మాక్‌ టెస్ట్‌లు సెప్టెంబర్‌ 19 నుంచి ప్రారంభం కానున్నాయి.
టెట్ హాల్‌ టికెట్లు సెప్టెంబర్ 22 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని షెడ్యూల్‌లో పేర్కొన్నారు. అంతా సవ్యంగా జరిగితే షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ 3 నుంచి ఆన్‌లైన్‌ విధానంలో టెట్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలు అక్టోబరు 20వ తేదీతో ముగుస్తాయి. ఆయా తేదీల్లో రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు జరుగుతాయి. పేపర్‌-1ఏ ఎస్జీటీ టీచర్లకు, పేపర్‌-1బీ స్పెషల్ ఎడ్యుకేషన్‌ ఎస్జీటీ టీచర్లకు ఉంటుంది. పేపర్‌-2ఏ స్కూల్‌ అసిస్టెంట్లకు, పేపర్‌-2బీ స్పెషల్ ఎడ్యుకేషన్‌ స్కూల్‌ అసిస్టెంట్లకు నిర్వహిస్తారు. ఇక ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లకు ప్రత్యేకంగా ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష నిర్వహిస్తారు. డీఎస్సీలో టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటీజీ ఇస్తారన్న సంగతి తెలిసిందే.

టెట్‌ ప్రొవిజినల్‌ ఆన్సర్‌ కీ విడుదల తేదీ అక్టోబర్‌ 4న విడుదల చేస్తారు. ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ తేదీ: అక్టోబర్‌ 5 నుంచి ప్రారంభమవుతుంది. ఫైనల్‌ ఆన్సర్ కీ అక్టోబర్‌ 27న విడుదల చేస్తారు. అనంతరం నవంబర్‌ 2వ తేదీన టెట్‌ ఫలితాలు విడుదల చేయనున్నారు. పేపర్‌-1, పేపర్‌-2 పరీక్షలకు మొత్తం 150 ఆబ్జెక్టివ్‌ టైప్‌ ప్రశ్నలకు 150 మార్కులకు నిర్వహిస్తారు. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉండదు. మొదటి సెషన్‌ పరీక్ష ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్‌ పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. ఇతర అప్‌డేట్‌ల కోసం అధికారిక వెబ్‌సైట్‌ చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.