AP PGECET 2025 Results: ఏపీ పీజీఈసెట్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.. ర్యాంకు కార్డు డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మా డి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ పీజీఈసెట్‌-2025 ఫలితాలు మంగళవారం (జూన్‌ 24) సాయంత్రం విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ సోషల్‌ మీడియా వేదికగా ఇవాళ సాయంత్రం విడుదల..

AP PGECET 2025 Results: ఏపీ పీజీఈసెట్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.. ర్యాంకు కార్డు డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే
Andhra Pradesh PGECET Results

Updated on: Jun 24, 2025 | 8:12 PM

అమరావతి, జూన్‌ 24: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మా డి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ పీజీఈసెట్‌-2025 ఫలితాలు మంగళవారం (జూన్‌ 24) సాయంత్రం విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ సోషల్‌ మీడియా వేదికగా ఇవాళ సాయంత్రం విడుదల చేశారు. ఈ పరీక్షలకు హాజరైన విద్యార్ధులుఈ కింది అధికారిక వెబ్‌సైట్‌లో లింక్‌లో తమ వివరాలు నమోదు చేసి ర్యాంకు కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తాజా ఫలితాల్లో ఈ పరీక్షలో 93.55 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

కాగా ఇంజినీరింగ్‌, ఫార్మసీకి సంబంధించి మొత్తం 13 సబ్జెక్టుల్లో ఈ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తంగా 14,231 మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా.. అందులో 11,244 మంది అర్హత సాధించారు. వీరిలో 5,491 మంది అబ్బాయిలు, 5,753మంది అమ్మాయిలు ఉన్నారు. ఏపీ పీజీఈసెట్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మంత్రి లోకేశ్‌ అభినందనలు తెలిపారు.

ఏపీ పీజీఈసెట్‌ 2025 ర్యాంకు కార్డు డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.