AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP High Court Jobs: నిరుద్యోగులకు అలర్ట్.. హైకోర్టులో 245 పోస్టుల భ‌ర్తీకి సర్కార్‌ ఉత్తర్వులు జారీ!

ఏపి హైకోర్టులో 245 పోస్టుల భ‌ర్తీకి ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ కేట‌గిరిల‌లో రెగ్యుల‌ర్ పద్ధతి లో 242 పోస్టులు భ‌ర్తీ చేస్తారు. మిగిలిన 3 పోస్టులు కాంట్రాక్ట్ ప‌ద్ధతిలో నియామ‌కం చేపట్టనున్నారు. ఈ మేరకు ఉత్తర్వులను న్యాయ‌శాఖ కార్యద‌ర్శి ప్రతిభాదేవి జారీ చేశారు..

AP High Court Jobs: నిరుద్యోగులకు అలర్ట్.. హైకోర్టులో 245 పోస్టుల భ‌ర్తీకి సర్కార్‌ ఉత్తర్వులు జారీ!
High Court Jobs
Srilakshmi C
|

Updated on: May 30, 2025 | 2:33 PM

Share

అమ‌రావ‌తి, మే 30: నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్ట్‌ ఖాళీగా ఉన్న 245 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ అయ్యాయి. వివిధ కేట‌గిరీల్లో రెగ్యుల‌ర్ బేస్‌లో 242, అలాగే కాంట్రాక్ట్ ప‌ద్ధతిలో 3 పోస్టులు భ‌ర్తీ చేయనున్నారు. ఈ మేర‌కు న్యాయ‌శాఖ కార్యద‌ర్శి జి.ప్రతిభాదేవి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని హైకోర్టు, ప్రభుత్వ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు భర్తీకి రంగం సిద్ధం చేశారు.

పోస్టుల పేర్లు, వివరాలు, అర్హత, వయోపరిమితి, జీతం, దరఖాస్తు ప్రక్రియ, ప్రారంభ, చివరి తేదీ, ఫీజు, ఎంపిక ప్రక్రియ వంటి వివరాలను అధికారక నోటిఫికేషన్‌లో పొందుపరుస్తామన్నారు. కాగా ఇప్పటికే 1620 పోస్టుల భర్తీకి రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దరఖాస్తుల సమర్పణ ప్రక్రియ కొనసాగుతోంది. జూన్ 2తో ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు ముగియనుంది. ఈ క్రమంలో త్వరలోనే మరో నోటిఫికేషన్ కూడా విడుదల చేసేందుకు హైకోర్టు అనుమతి తెలిపింది. అర్హతలు కలిగిన నిరుద్యోగులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు తెలిపారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉద్యోగ నియామక ప్రకటనలు నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటిగా వస్తున్నాయి. ఇప్పటికే 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ 2025 విడుదల చేయగా.. త్వరలోనే నియామక రాత పరీక్షలు కూడా నిర్వహించనుంది. అలాగే రాష్ట్రంలోని పలు జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ప్రస్తుతం ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. త్వరలోనే మరో నోటిఫికేషన్‌ రానుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌ లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అండర్ 19 ప్రపంచకప్ విజేతలపై బీసీసీఐ కాసుల వర్షం..
అండర్ 19 ప్రపంచకప్ విజేతలపై బీసీసీఐ కాసుల వర్షం..
వాలెంటైన్స్ వీక్ రోజ్ డే తోనే ఎందుకు స్టార్ట్ అవుతుంది..?
వాలెంటైన్స్ వీక్ రోజ్ డే తోనే ఎందుకు స్టార్ట్ అవుతుంది..?
సోఫాలు, పడకలున్నా కుక్కలు తలుపు దగ్గరే ఎందుకు పడుకుంటాయి?
సోఫాలు, పడకలున్నా కుక్కలు తలుపు దగ్గరే ఎందుకు పడుకుంటాయి?
ఆ హీరో ఇంటిముందు వర్షంలో తడుస్తూ రోజంతా నిలబడ్డా..!
ఆ హీరో ఇంటిముందు వర్షంలో తడుస్తూ రోజంతా నిలబడ్డా..!
వెండి గుట్టు విప్పిన నిపుణులు.. గనుల నుంచి మార్కెట్ దాకా ప్రయాణం
వెండి గుట్టు విప్పిన నిపుణులు.. గనుల నుంచి మార్కెట్ దాకా ప్రయాణం
ఇంట్లో ఈ ఐదు వస్తువులు ఉంటే.. మీపై లక్ష్మీ కటాక్షం ఖాయం..!
ఇంట్లో ఈ ఐదు వస్తువులు ఉంటే.. మీపై లక్ష్మీ కటాక్షం ఖాయం..!
ఏం హుషారున్నార్రా సామి.. ఏకంగా కంపెనీకి వెళ్లి వాళ్లకే బురిడీ..
ఏం హుషారున్నార్రా సామి.. ఏకంగా కంపెనీకి వెళ్లి వాళ్లకే బురిడీ..
సబ్బు Vs ఫేస్ వాష్: మెరిసే చర్మానికి ఏది మంచిది..?
సబ్బు Vs ఫేస్ వాష్: మెరిసే చర్మానికి ఏది మంచిది..?
ఆ సమస్య మిమ్మల్ని వేధిస్తోందా.. ఐతే, దొండకాయతో గుడ్ బై చెప్పండి
ఆ సమస్య మిమ్మల్ని వేధిస్తోందా.. ఐతే, దొండకాయతో గుడ్ బై చెప్పండి
ఉప్పు, జామకాయ కలిపి తింటున్నారా..? శరీరంలో జరిగేది తెలిస్తే..
ఉప్పు, జామకాయ కలిపి తింటున్నారా..? శరీరంలో జరిగేది తెలిస్తే..