EWS Medical Seats: ఈడబ్ల్యూఎస్‌ కోటా సీట్ల కేటాయింపుపై స్టే విధించిన ఏపీ హైకోర్టు.. కారణం ఇదే

|

Aug 14, 2024 | 6:16 AM

తెలుగు రాష్ట్రాల్లో నీట్‌ యూజీ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద 10 శాతం సీట్లు భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జీవో కూడా విడుదల చేసింది..

EWS Medical Seats: ఈడబ్ల్యూఎస్‌ కోటా సీట్ల కేటాయింపుపై స్టే విధించిన ఏపీ హైకోర్టు.. కారణం ఇదే
EWS Medical Seats
Follow us on

అమరావతి, ఆగస్టు 14: తెలుగు రాష్ట్రాల్లో నీట్‌ యూజీ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద 10 శాతం సీట్లు భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జీవో కూడా విడుదల చేసింది. అయితే ఈడబ్ల్యూఎస్‌ కోటా సీట్ల కేటాయింపు జీవో నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. జీవోను సవాల్‌ చేస్తూ మెడికల్‌ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం (ఆగస్టు 13) హైకోర్టులో విచారణ జరపగా.. మెడికల్‌ సీట్లు పెంచి ఈడబ్ల్యూఎస్‌ కింద సీట్లు ఇవ్వాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఠాకూర్‌ వాదనలు వినిపించారు.

ప్రైవేటు కాలేజీల్లో సీట్లు పెంచకుండానే ఈడబ్ల్యూఎస్‌ కింద సీట్లు ఇవ్వాలని ప్రభుత్వం జీవో జారీ చేసిందని, సీట్లు పెంచకుండా ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద సీట్లు కేటాయిస్తే ఓపెన్ కేటగిరీ విద్యార్దులు నష్టపోతారని ధర్మాసనం దృష్టికి తీసుకు వచ్చారు. అందువల్ల తక్షణమే ఈ జీవోను నిలుపుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. పిటిషనర్‌ వాదనతో ఏకీభవించిన కోర్టు, జీవోను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను కోర్టు 6 వారాలకు వాయిదా వేసింది.

వెబ్‌సైట్లో ఐబీపీఎస్‌ క్లర్క్స్‌ ప్రిలిమ్స్‌ అడ్మిట్‌ కార్డులు.. పరీక్ష తేదీలు ఇవే

దేశ వ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వ బ్యాంకుల్లో క్లర్క్‌ పోస్టుల భర్తీకి సంబంధించి ఐబీపీఎస్‌ క్లర్క్స్‌ ప్రిలిమ్స్‌ అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు వెబ్‌సైట్‌ నుంచి ప్రిలిమ్స్‌ పరీక్ష అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ కింద ద్వారా దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6,128 క్లర్క్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ప్రిలిమిన‌రీ, మెయిన్ ఎగ్జామ్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రిలిమిన‌రీ పరీక్ష ఆగస్టు 24, 25, 31 తేదీల్లో ఆన్‌లైన్‌ విధానంలో జరగనుంది. అనంతరం అక్టోబర్‌లో మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి

ఐబీపీఎస్‌ క్లర్క్స్‌ ప్రిలిమ్స్‌ అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.