AP Gurukul Entrance Exam 2023: రేపే ఏపీ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు ఎంట్రన్స్ టెస్ట్.. హాల్ టికెట్ల డౌన్‌లోడ్‌ ఇలా..

|

May 19, 2023 | 7:40 PM

ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్షలను (శనివారం) మే 20న‌ నిర్వహించనున్నట్లు కార్యదర్శి నరసింహారావు ఓ ప్రకటనలో..

AP Gurukul Entrance Exam 2023: రేపే ఏపీ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు ఎంట్రన్స్ టెస్ట్.. హాల్ టికెట్ల డౌన్‌లోడ్‌ ఇలా..
AP Gurukul Entrance Exam
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్షలను (శనివారం) మే 20న‌ నిర్వహించనున్నట్లు కార్యదర్శి నరసింహారావు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు 5,6,7,8 తరగతులకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్‌, డిగ్రీ కళాశాలల విద్యార్ధులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. ఓఎమ్మార్‌ జవాబు పత్రం నింపేందుకు బ్లూ, బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్నులు మాత్రమే ఉపయోగించాలని సూచించారు. ఈ ప్రవేశ పరీక్షల ద్వారా 5వ తరగతిలో అడ్మిషన్‌ కల్పిస్తారు. అలాగే 6, 7, 8, తరగతుల్లో మిగిలిపోయిన సీట్లలో ప్రవేశాలు కల్పించనున్నారు. వీరందరికీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో రేపు ఏపీఆర్‌ఎస్‌ సెట్‌ – 2023, ఏపీ ఆర్‌జేసీ, డీసీ సెట్‌- 2023 ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా మైనారిటీ విద్యార్థులకు మాత్రం ఎటువంటి ప్రవేశ పరీక్ష లేకుండానే ప్రవేశాలు కల్పిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.