Fee Reimbursement: ఇక విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ జమ లేనట్లే! కూటమి సర్కార్ కొత్త ప్లాన్ ఇదే..

|

Nov 08, 2024 | 8:43 AM

వివిధ కాలేజీల్లో అమలవుతున్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. గతేడాది వరకు విద్యార్ధుల తల్లుల ఖాతాలో జమ అవుతూ వస్తుండగా.. ఇకపై ఈ విధానాన్ని రద్దు చేసే యోచనలో కూటమి సర్కార్ ప్లాన్ చేస్తుంది. బదులుగా కాలేజీ యాజమన్యాల ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోనుంది..

Fee Reimbursement: ఇక విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ జమ లేనట్లే! కూటమి సర్కార్ కొత్త ప్లాన్ ఇదే..
Fee Reimbursement
Follow us on

అమరావతి, నవంబర్‌ 8: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు అమలవుతున్న ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం కింద అందే నగదును నేరుగా తల్లుల ఖాతాల్లో జమ అయ్యేలా గత ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అయితే ఈ ఏడాది నుంచి తల్లుల ఖాతాల్లో కాకుండా కళాశాలల యాజమాన్య ఖాతాల్లోకే వేయాలని తాజాగా కూటమి సర్కార్‌ నిర్ణయించింది. దీనికి సంబంధించిన విధివిధానలను త్వరలోనే ప్రకటించనుంది. 2014-19 మధ్య హయాంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంటును కళాశాలల యాజమాన్య ఖాతాల్లోకే జమ చేసేవారు.

అయితే జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లుల ఖాతాల్లోకి వేసే విధానం అమలులోకి తెచ్చారు. నేరుగా తల్లుల ఖాతాల్లోకే జమ అవుతుందనే కారణంగా కళాశాలల యాజమాన్యాలు నిర్దేశిత గడువుకు ఫీజుల్ని చెల్లించాల్సిందేనని విద్యార్థులపై ఒత్తిడి తీసుకువచ్చారు. కొంతమంది ఫీజులు కట్టలేక పరీక్షలకు దూరం అవ్వవల్సిన పరిస్థితి నెలకొంది. విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు కలిపి మొత్తం రూ.3,840 కోట్లు బకాయిలు ఉన్నాయి. దీంతో ఇందులో ఉన్న ఇబ్బందులను గ్రహించిన కూటమి ప్రభుత్వం విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో కాకుండా కళాశాలల యాజమాన్య ఖాతాల్లోనే ఫీజు రీయింబర్స్‌మెంటు ఫీజు వేయాలని భావిస్తోంది.

‘మెడికల్‌ పీజీ ప్రవేశాల్లో స్థానికతపై వివరణివ్వండి’ తెలంగాణ హైకోర్టు

తెలంగాణలో మెడికల్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ (పీజీ) ప్రవేశాల్లో స్థానికతకు సంబంధించిన వివాదం సంబంధించి వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వం, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. పీజీ మెడికల్‌ ప్రవేశాల నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం అక్టోబరు 28న జారీ చేసిన జీవో నం.148ను సవాలు చేస్తూ మంచిర్యాలకు చెందిన డాక్టర్‌ ఎస్‌ సత్యనారాయణతోపాటు మరొక విద్యార్ధి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె శ్రీనివాసరావుల ధర్మాసనం ఇరు పక్షాల వాదనలు విన్నారు. పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది ఎం సురేందర్‌రావు వాదనలు వినిపిస్తూ.. తెలంగాణకు చెందిన పిటిషనర్లు మరోచోట ఎంబీబీఎస్‌ చేశారన్న కారణంగా స్థానిక కోటాను తిరస్కరించినట్లు తెలిపారు. తెలంగాణ బయట ఉన్న సిద్ధార్థ మెడికల్‌ కాలేజీ విద్యార్థులను స్థానికులుగా పరిగణించడం చెల్లదని తెలిపారు. వాదనలను విన్న ధర్మాసనం ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వం, యూనివర్సిటీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల11వ తేదీకి వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.