School Holidays: తరుముకొస్తున్న తుపాన్‌.. అక్టోబర్ 31 వరకు ఆ జిల్లాలోని అన్ని స్కూళ్లకు సెలవులు!

School Holidays in Andhra Pradesh: నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ఆంధ్రప్రదేశ్‌ వైపుకు దూసుకొస్తుంది. అక్టోబర్ 28వ తేదీ అర్ధరాత్రి సమయానికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈదురు గాలులు గంటకు 100 కిలోమీటర్ల మేర వీచే అవకాశం ఉండటంతో ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. తీరం దాటే సమయంలోనూ భారీ వర్షాలు కురుస్తాయని..

School Holidays: తరుముకొస్తున్న తుపాన్‌.. అక్టోబర్ 31 వరకు ఆ జిల్లాలోని అన్ని స్కూళ్లకు సెలవులు!
Montha Cyclone Holidays

Updated on: Oct 27, 2025 | 7:11 PM

అమరావతి, అక్టోబర్ 27: నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ఆంధ్రప్రదేశ్‌ వైపుకు దూసుకొస్తుంది. అక్టోబర్ 28వ తేదీ అర్ధరాత్రి సమయానికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈదురు గాలులు గంటకు 100 కిలోమీటర్ల మేర వీచే అవకాశం ఉండటంతో ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. తీరం దాటే సమయంలోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించడంతో అన్ని డిపార్ట్‌మెంట్‌లు అప్రమత్తం అయ్యాయి. ఇక ఈ తుపానుకు ‘మొంథా’ గా నామకారణం చేసిన సంగతి తెలిసిందే. ‘మొంథా’కు థాయ్ లాండ్ సూచించిన పేరు పెట్టారు. ‘మొంథా ‘ అంటే అందమైన సువాసన కలిగిన పుష్పం అని అర్ధం. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో విశాఖ జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ 08912590102, 08912590100 ఏర్పాటు చేశారు. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసారు జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్. ఈరోజు రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. 3 రోజులు అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ సూచించ్చారు. 27,28,29 తేదీల్లో భారీ వర్షాలు, పెనుగాలులు విచే అవకాశం ఉంది. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు.

జిల్లా, డివిజన్, మండల ,గ్రామ స్థాయి అధికార యంత్రాంగం అంతా హెడ్ క్వార్టర్స్ లో ఉండాలనీ ఆదేశించారు. ఉద్యోగులకు ఎలాంటి సెలవులు మంజూరు చేయలేదన్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా చూడాలని, పర్యాటకులు తీరప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎన్ డి ఆర్ ఎఫ్, ఎస్ డి ఆర్ ఎఫ్ టీమ్ లను సిద్ధంగా ఉంచాలన్నారు. తుఫాను సూచనలు నేపథ్యంలో అప్రమత్తమైన విశాఖ యంత్రాంగం ప్రముఖ పర్యాటక ప్రాంతాల మూసివేస్తున్నారు. పర్యాటకుల భద్రత దృష్ట్యా పార్కులు, సందర్శన స్థలాల మూసివేయాలని విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆదేశించారు. 27, 28 తేదీలలో కైలాసగిరిపై జిప్ లైనర్, రోప్ వే లు నిలిపివేసారు. సెంట్రల్ పార్క్, వుడా పార్క్ సహా మిగిలిన సందర్శనా స్థలాలు మూసివేస్తున్నామన్నారు. పర్యటక పర్యాటకులకు భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్ ప్రకటించారు.

మరోవైపు మొంథా తుపాను నేపథ్యంలో పలు జిల్లాల్లోని ప్రైవేట్, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు ప్రభుత్వం ఇప్పటికే సెలవులు ప్రకటించింది. అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని కాలేజీలకు ఈ రోజు నుంచి అక్టోబర్‌ 29 వరకు, పశ్చిమగోదావరి, ఏలూరు, బాపట్ల, వైఎస్సార్‌ కడప జిల్లాలకు 27 నుంచి 28 వరకు సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే తుఫాను ప్రభావం అధికంగా ఉన్న కాకినాడ జిల్లాకు మాత్రం ఈ రోజు నుంచి అక్టోబర్‌ 31 వరకు అంటే ఏకంగా 5 రోజుల పాటు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. తుపాను పరిస్థితిని బట్టి అవసరమైతే సెలవులను పొడిగించే అవకాశాలు కూడా ఉందని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.