Thalliki Vandanam Scheme 2025: స్కూల్‌ విద్యార్థులకు శుభవార్త.. రూ.15 వేలు జమపై కీలక అప్‌డేట్!

రాష్ట్ర విద్యార్థులకు కూటమి సర్కార్‌ శుభవార్త చెప్పింది. తల్లికి వందనం పథకం కింద కుటుంబం చదువుకుంటున్న పిల్లలందరికీ ఒక్కొక్కరికి రూ.15,000 చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని కూటమి సర్కార్‌ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కూటమి సర్కార్‌ అధికారంలోకి..

Thalliki Vandanam Scheme 2025: స్కూల్‌ విద్యార్థులకు శుభవార్త.. రూ.15 వేలు జమపై కీలక అప్‌డేట్!
Thalliki Vandanam Scheme

Updated on: May 22, 2025 | 10:42 AM

అమరావతి, మే 22: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యార్థులకు కూటమి సర్కార్‌ శుభవార్త చెప్పింది. తల్లికి వందనం పథకం కింద కుటుంబం చదువుకుంటున్న పిల్లలందరికీ ఒక్కొక్కరికి రూ.15,000 చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని కూటమి సర్కార్‌ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ విద్యా సంవత్సరం కూడా ముగిసింది. ఇంకా తల్లికి వందనం పథకం కింద డబ్బు జమ చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీనిపై తాజాగా ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ వచ్చింది.

స్కూళ్లు తెరిచేలోగా తల్లుల అకౌంట్‌లోకి రూ.15 వేలు జమ చేయనున్నట్లు కూటమి సర్కార్ తెలిపింది. సంక్షేమ పథకాల వార్షిక క్యాలెండర్ విడుదల చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అందులో ఏ నెలలో ఏ పథకం అమలు చేస్తామనే వివరాలు ప్రజలకు తెలియజేయాలని అన్నారు. తల్లికి వందనం పథకం కింద స్కూళ్లు తెరిచేలోగా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.15 వేలు జమ చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఒకే విడతలో ఈ నిధులు జమ చేస్తామని తెలిపారు. కాగా తల్లికి వందనం పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారి కార్యక్రమాల్లో ఒకటి. ఇది సూపర్ సిక్స్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా అమలు చేస్తున్నారు. ఈ పథకం తల్లుల్ని ఆర్థికంగా ప్రోత్సహించి, వారి పిల్లలకు విద్యను అందించడమే లక్ష్యంగా రూపొందించబడింది.

అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాహనదారులకు ఊరట కలిగించేలా మరో ప్రకటన చేసింది. గత ప్రభుత్వం విధించిన గ్రీన్ టాక్స్‌ను తగ్గిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో సరకు రవాణా చేసే వాహనదారులకు ఆర్థికంగా భారం భారీగా తగ్గనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.