అమరావతి, జులై 19: ఆంధ్రప్రదేశ్‌లోని పలు యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జ్ వీసీలను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం (జులై 18) నియమించింది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలపడంతో దాదాపు 17 యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జ్ వీసీలను నియమించేందుకు మార్గం సుగమమైంది. ఈ సందర్భంగా ఆరోగ్య యూనివర్సిటీ వీసీ బాబ్జీ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. అనంతరం డీఎంఈ నరసింహంకు వీసీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎస్‌వీయూ ఇన్‌ఛార్జ్ వీసీగా చిప్పాడ అప్పారావు, ఎస్‌కేయూ ఇన్‌ఛార్జి వీసీగా బి అనితలను నియమించారు. నియమితులయ్యారు.
Incharge VC’s for Andhra Pradesh State universities
GO pic.twitter.com/JHxONaVO0X ఇవి కూడా చదవండి— REMOTE NEURAL Monitoring (@RNM_Technology) July 18, 2024
తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల సొసైటీలో శుక్రవారం (జులై 18) నుంచి జరగాల్సిన నాన్‌టీచింగ్ స్టాఫ్ కౌన్సెలింగ్ వాయిదా పడింది. సొసైటీలో ఇప్పటికే బదిలీ ప్రక్రియ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా జులై 15 నుంచి పదోన్నతులు, బదిలీల షెడ్యూలు ప్రారంభమైంది. జులై 15 నుంచి మొదలైన జేఎల్, పీజీటీ పోస్టుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ.. ఆ మరుసటి రోజు (జులై 16) సాయంత్రం వరకు కొనసాగింది. దీంతో జులై 16న జరగాల్సిన ప్రక్రియ ఆగిపోయింది. ఆ రోజు జరగవల్సిన టీజీటీ, కాంట్రాక్టు రెగ్యులరైజేషన్, రిక్వెస్ట్ బదిలీలు వాయిదా పడ్డాయి. జులై 17వ తేదీన సెలవు దినం కావడంతో ప్రత్యేక టీచర్ల బదిలీ ప్రక్రియ ఆగిపోయింది. దీంతో జులై 18వ తేదీన జరగవల్సిన నాన్‌టీచింగ్ స్టాఫ్ షెడ్యూలును వాయిదా వేసినట్లు ఎస్సీ గురుకుల సొసైటీ ఉద్యోగులకు సమాచారం అందించింది.