AP DSC 2024 Free Coaching: 3 నెలలపాటు డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ.. కూటమి సర్కార్‌ కీలక ప్రకటన

|

Sep 10, 2024 | 10:20 AM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో త్వరలో 16,347 టీచర్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఇప్పటికే కూటమి సర్కార్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ త్వరలోనే వెలువడనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టెట్ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. వచ్చే నెల 3 నుంచి 20వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. టెట్ ప్రక్రియ ముగిశాక వెంటనే..

AP DSC 2024 Free Coaching: 3 నెలలపాటు డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ.. కూటమి సర్కార్‌ కీలక ప్రకటన
AP DSC 2024 Free Coaching
Follow us on

అమరావతి, సెప్టెంబర్ 10: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో త్వరలో 16,347 టీచర్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఇప్పటికే కూటమి సర్కార్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ త్వరలోనే వెలువడనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టెట్ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. వచ్చే నెల 3 నుంచి 20వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. టెట్ ప్రక్రియ ముగిశాక వెంటనే డీఎస్సీ నియామక ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని గిరిజన అభ్యర్థులకు ఉచిత డీఎస్సీ శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని 6 ఐటీడీఏల్లో, గిరిజనేతరుల ప్రాంతాల్లో రెండు లేదా మూడు సెంటర్లు ఏర్పాటు చేయనుంది. ఒక్కో కేంద్రంలో 150 మందికి శిక్షణ ఇస్తారు. మూడు నెలలపాటు సాగే ఈ శిక్షణకు ఒక్కో అభ్యర్థికి రూ.25 వేల వరకు ఖర్చు చేయనుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

టీజీసీపీజీఈటీ- 2024 మొదటిదశలో 21,505 మందికి సీట్ల కేటాయింపు

తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీల పరిధిలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సెప్టెంబ‌ర్ 8న‌ మొదటి దశ సీట్లు కేటాయించినట్లు రాష్ట్రస్థాయి కామన్‌ పీజీ ఎంట్రెన్స్‌ టెస్ట్స్‌ (టీజీసీపీజీఈటీ)- 2024 కన్వీనర్‌ పాండురంగారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. 5,811 మంది విద్యార్థులు, 15,694 విద్యార్థినులకు సీట్లు ఇచ్చారు. అంటే మొత్తం 21,505 మందికి ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంఎల్‌ఐఎస్‌సీ తదితర కోర్సుల్లో సీట్ల కేటాయింపు పూర్తయింది. తొలి విడతలో ప్రవేశాలు పొందిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రుసుములు చెల్లించి.. సెప్టెంబ‌ర్ 13వ తేదీలోగా సీట్లు పొందిన కాలేజీల్లో చేరాలని కన్వినర్‌ పాండురంగా రెడ్డి సూచించారు. ప్రవేశాల సమయంలో సంబంధిత కాలేజీలకు టీసీని మాత్రమే అందజేయాలని, ఇతర ధ్రువీకరణపత్రాలను పరిశీలన కోసం మాత్రమే సంబంధిత ప్రిన్సిపాల్‌లకు ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.

బీపీఈడీ, డీపీఈడీ రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి

తెలంగాణ రాష్ట్రంలోని వ్యాయామ విద్య కాలేజీల్లోని బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో రెండో దశ సీట్ల కేటాయింపు సెప్టెంబ‌ర్ 8వ తేదీతో పూర్తయినట్లు టీజీపీఈసెట్‌-2024 కన్వీనర్‌ రమేశ్‌బాబు తెలిపారు. రెండో దశలో మొత్తం 512 మందికి సీట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు. రెండో విడతలో సీట్లు పొందిన అభ్యర్ధులు సెప్టెంబ‌ర్ 9 నుంచి 12వ తేదీ మధ్య కాలేజీల్లో చేరాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.