AP Mega DSC 2025: మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. ఏమన్నారంటే?

మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసం ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు కీలక ప్రకటన జారీ చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో జరుగుతున్న బడ్జెట్‌ సమావేశాల్లో సీఎం చంద్రబాబు మెగా డీఎస్సీతోపాటు తల్లికి వందనం, నిరుద్యోగ భృతి గురించి కూడా కీలక అంశాలను వివరించారు. అవేంటంటే..

AP Mega DSC 2025: మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. ఏమన్నారంటే?
CM Nara Chandrababu

Updated on: Feb 26, 2025 | 7:04 AM

అమరావతి, ఫిబ్రవరి 26: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంగళవారం (ఫిబ్రవరి 25) సాయంత్రం కొలువుదీరిన అసెంబ్లీలో సీఎం చంద్రబాబు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అమలవుతున్న హామీలు, సూపర్‌ సిక్స్‌లోని మిగతా పథకాల అమలుకు చేపట్టిన చర్యలను సీఎం అసెంబ్లీలో వివరించారు. వచ్చే మే నెలలోనే తల్లికి వందనం పథకం అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు.

అలాగే మెగా డీఎస్సీపై కూడా సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాబోయే విద్యా సంవత్సరం ప్రారంభంనాటికి అంటే వేసవి సెలవుల తర్వాత జూన్‌ నెలలో పాఠశాలలు ప్రారంభం నాటికి 16,384 టీచర్‌ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఆ మేరకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో తెలిపారు. రిక్రూట్‌మెంట్‌ పూర్తి చేసి, ట్రైనింగ్‌ ఇచ్చి పోస్టింగ్‌లు అందచేస్తామని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే నిరుద్యోగ భృతి కింద రూ.3,000 అందజేస్తామన్నారు.

సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ డిసెంబర్‌ 2025 అడ్మిట్‌ కార్డులు విడుదల

జాయింట్‌ సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ ఎగ్జామినేషన్‌ డిసెంబర్‌-2024 సెషన్‌ పరీక్షల అడ్మిట్‌ కార్డులను ఎన్‌టీఏ విడుదల చేసింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు తమ అప్లికేషన్‌ నెంబర్‌, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఎన్టీయే తెలిపింది. అడ్మిట్‌ కార్డులపై అభ్యర్థుల ఫోటో, సంతకం, బార్‌కోడ్‌లో ఏవైనా తప్పుగా వస్తే తిరిగి మళ్లీ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఎన్‌టీఏ సూచించింది. ఈ పరీక్ష ఫిబ్రవరి 28, మార్చి 1, 2వ తేదీల్లో రోజుకు రెండు షిఫ్టుల్లో జరగనున్నాయి. సైన్స్‌ విభాగాల్లో పరిశోధన, బోధనకు అవకాశం కల్పించేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఈ పరీక్షను యేటా రెండు సార్లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జేఆర్‌ఎఫ్‌తో పాటు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అర్హత, పీహెచ్‌డీ ప్రవేశాల కోసం సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌ నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ అడ్మిట్‌ కార్డుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.