
అమరావతి, జూన్ 1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయ కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికిగానూ 3 ఏళ్ల LLB, 5 ఏళ్ల LLB, 2 ఏళ్ల LLM పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు జూన్ 5న లాసెట్-2025 పరీక్ష జరగనుంది. శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు సెట్ ఛైర్‌పర్సన్ ప్రొఫెసర్ వి ఉమ తెలిపారు. జూన్ 5వ తేదీన ఉదయం 9 నుంచి 10.30 వరకు ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది. మొత్తం 27,253 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 133 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు సెట్ కన్వీనర్ సీతాకుమారి వివరించారు. పరీక్ష అనంతరం జూన్ 16న తుది కీ విడుదల చేస్తామని, జూన్ చివరి వారంలో ఫలితాలను విడుదల చేస్తామని వివరించారు. లాసెట్ ప్రశ్నాపత్రం తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ లాసెట్ 2025 అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి.
తెలంగాణ రాష్ట్రంలోని లా కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2025 ప్రవేశ పరీక్ష ఈ నెల మొదటి వారంలో జరగనుంది. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్ట్రేషన్, మొబైల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి https://lawcet.tgche.ac.in/ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక జూన్ 6వ తేదీన ప్రవేశ పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఉంటుంది. ఇందులో వచ్చిన ర్యాంకు ద్వారా 3, 5 ఏళ్ల ఎల్‌ఎల్‌బీ, రెండేళ్ల ఎల్‌ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
తెలంగాణ లాసెట్ 2025 అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.