ఆంధ్రప్రదేశ్ పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు 2023 హాజరయ్యే విద్యార్థులు తమ వివరాలను ఆన్‌లైన్‌లో తప్పుగా నమోదు చేస్తే సరిచేసేందుకు అవకాశం ఇచ్చినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి తెలిపారు. పదో తరగతి నామినల్ రోల్స్ ఎవైనా తప్పులు దొర్లితే అలాగే ద్రువపత్రాల్లో వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని సరిచేసే అవకాశం మళ్లీ దొరకదు. ఈ సమస్యలకు ముందుగానే చెక్‌పెట్టేలా ఎస్సెస్సీ బోర్డు ఎడిట్ ఆప్షన్‌ను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు పాఠశాల లాగిన్‌లో ఎడిట్ ఐచ్ఛికం ఇచ్చామని పేర్కొంది.
విద్యార్ధులకు సంబంధించిన పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, పుట్టిన తేదీ, విద్యార్థి ఎంచుకున్న ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ కాంబినేషన్, విద్యార్థి ఎంపిక చేసుకున్న మాధ్యమం, ఓఎస్సెస్సీ సబ్జెక్టు కోడ్, వొకేషనల్ ఎస్సెస్సీ సబ్జెక్టు, కోడ్, విద్యార్థి పుట్టుమచ్చల చిహ్నాలు, విద్యార్థి ఫొటో, సంతకం వంటి వివరాలను సరిచూసుకోవాలని తెల్పింది. ఈ మేరకు నేటి నుంచి ఈ నెల 20వ తేదీవరకు తప్పులను సరి చేసుకోవాలని ఆయా పాఠశాలల హెడ్మాస్టర్లకు సూచించింది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.