AMU Recruitment 2022: అలీఘర్‌ ముస్లిం యూనివర్సిటీలో 78 టీచింగ్‌ ఉద్యోగాలు.. రూ.2 లక్షలకుపైగా జీతంతో..

|

Jun 05, 2022 | 5:22 PM

ఉత్తర ప్రదేశ్‌లోని అలీఘర్‌ ముస్లిం యూనివర్సిటీ (Aligarh Muslim University).. ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ వంటి పలు టీచింగ్‌ (Teaching Posts) పోస్టుల భర్తీకి..

AMU Recruitment 2022: అలీఘర్‌ ముస్లిం యూనివర్సిటీలో 78 టీచింగ్‌ ఉద్యోగాలు.. రూ.2 లక్షలకుపైగా జీతంతో..
Amu
Follow us on

Aligarh Muslim University Teaching Recruitment 2022: ఉత్తర ప్రదేశ్‌లోని అలీఘర్‌ ముస్లిం యూనివర్సిటీ (Aligarh Muslim University).. ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ వంటి పలు టీచింగ్‌ (Teaching Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 78

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: ప్రొఫెసర్/ డైరెక్టర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, రిసెర్చ్ అసోసియేట్, రిసెర్చ్ అసిస్టెంట్‌ పోస్టులు

విభాగాలు: అగ్రికల్చరల్ సైన్సెస్, ఆర్ట్స్, కామర్స్, ఇంటర్నేషనల్ స్టడీస్, లా, లైఫ్ సైన్సెస్, సైన్స్, సోషల్ సైన్స్, థియాలజీ, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్ స్టడీస్ అండ్ రిసెర్చ్ విభాగాల్లో ఖాళీలున్నాయి.

పే స్కేల్‌: పోస్టును బట్టి 29,000ల నుంచి రూ.2,18,200ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి ప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీజీడీఎం, సీఏ, ఐసీడబ్ల్యూఏ, పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. యూజీసీ నెట్‌/సెట్/స్లెట్‌లో అర్హత ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో టీచింగ్‌ అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. నింపిన దరఖాస్తులను డౌన్‌లోడ్‌ చేసుకుని పోస్టు ద్వారా పంపించాలి.

అడ్రస్: Selection Committee Section (Teaching), Office of the Registrar, Aligarh Muslim University, Aligarh – 202002.

దరఖాస్తు రుసుము: రూ.500 (పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది)

దరఖాస్తులకు చివరి తేదీలు: జూన్‌ 30, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.