AJNIFM Teaching Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఫరీదాబాద్‌లోని అరుణ్ జైట్లీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ (AJNIFM).. టీచింగ్ పోస్టుల (Teacher Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
పోస్టుల వివరాలు: టీచింగ్ పోస్టులు
సబ్జెక్టులు: ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ఎకనమిక్స్ అండ్ బిజినెస్ ఎన్విరాన్‌మెంట్, డిసిషన్ సైన్సెస్ అండ్ డేటా అనలిటిక్స్, పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్, గవర్నమెంట్ అకౌంటింగ్ అండ్ ఆడిట్ తదితర సబ్జెక్టుల్లో ఖాళీలున్నాయి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 55 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నోటిఫికేషన్‌లో చూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టునుబట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత టీచింగ్/ రిసెర్చ్/ ఇండస్ట్రీ/ ప్రొఫెషనల్ పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈమెయిల్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: డైరెక్టర్, ఏజేఎన్‌ఐఎఫ్‌ఎం, సెక్టర్-48, పాలి రోడ్, ఫరీదాబాద్-121001.
ఈమెయిల్ ఐడీ: recruitment@nifm.ac.in
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 30, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.