AIIMS Rishikesh Professor Recruitment 2022: భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన మహారాష్ట్రలోనున్న రిషికేశ్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS Rishikesh).. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 33 ట్యూటర్, క్లినికల్ ఇన్‌స్ట్రక్టర్ (నర్సింగ్) పోస్టుల (Professor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ/డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించినవారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సంబంధిత పనిలో కనీసం 3 యేళ్ల అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 50 యేళ్లకు మించకుండా ఉండాలి.
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 15, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు రూ. 2000, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు రూ.1000లు చెల్లించాలి. వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాతపరీక్ష/ స్కిల్‌టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.15,600ల నుంచి రూ.39,100ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.