AIIMS Recruitment 2023: ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌లో ఉద్యోగాలు.. ఈ అర్హతలు తప్పనిసరి..

|

Jan 03, 2023 | 7:50 PM

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పూర్‌లోనున్న ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌.. 112 సీనియర్ రెసిడెంట్ (గ్రూప్‌ 'ఏ') పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

AIIMS Recruitment 2023: ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌లో ఉద్యోగాలు.. ఈ అర్హతలు తప్పనిసరి..
AIIMS Raipur
Follow us on

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పూర్‌లోనున్న ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌.. 112 సీనియర్ రెసిడెంట్ (గ్రూప్‌ ‘ఏ’) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అనస్థీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, బర్న్స్ & ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, క్లినికల్ హెమటాలజీ, కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్, డెంటిస్ట్రీ కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ అండ్‌ ఎండోడోంటిక్స్, పెడోడాంటిక్స్/ పీడియాట్రిక్స్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, ఎండోక్రైనాలజీ అండ్‌ మెటబాలిజం, ఈఎన్‌టీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ అండ్‌ టాక్సికాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, మెడికల్ ఆంకాలజీ, మైక్రోబయాలజీ, నియోనాటాలజీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మెడికల్‌ కౌన్సిల్ ఆఫ్‌ ఇండియా గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ(ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ), ఎండీఎస్‌, డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు జనవరి 31, 2023వ తేదీ నాటికి 45 యేళ్లకు మించకుండా ఉండాలి.

ఈ అర్హతలున్న అభ్యర్ధులు జనవరి 31, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్‌/ఓబీసీ అభ్యర్ధులు రూ.1000లు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూఎస్ అభ్యర్ధులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.67,700ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.