AIIMS: నెలకు రూ.50 వేలకు పైగా జీతంతో ఎయిమ్స్‌లో ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే నేరుగా..

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌లోనున్న ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌.. 29 జూనియర్‌ రెసిడెంట్ (నాన్-అకడమిక్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల..

AIIMS: నెలకు రూ.50 వేలకు పైగా జీతంతో ఎయిమ్స్‌లో ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే నేరుగా..
AIIMS Raipur

Updated on: Dec 12, 2022 | 6:38 AM

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌లోనున్న ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌.. 29 జూనియర్‌ రెసిడెంట్ (నాన్-అకడమిక్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మెడికల్‌ కౌన్సిల్ ఆఫ్‌ ఇండియా గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణతతోపాటు ఇంటర్న్‌షిప్ కూడా పూర్తి చేసి ఉండాలి. డిసెంబర్‌ 17, 2020 నుంచి డిసెంబర్‌ 16, 2022 మధ్య ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన వారికి ప్రాధాన్యాత ఉంటుంది. డీఎమ్‌సీ/ఎస్‌సీఐ/స్టేట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఉండాలి. అభ్యర్ధుల వయసు 30 యేళ్లకు మించకుండా ఉండాలి.

ఈ అర్హతలున్న అభ్యర్ధులు డిసెంబర్‌ 16, 2022వ తేదీలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా అప్లికేషన్లు పంపించాలి. జనరల్‌ అభ్యర్ధులు రూ.1000లు, ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు రూ.800లు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి. ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.56,100ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్‌..

All India Institute of Medical Sciences Raipur (Chhattisgarh)
G. E. Road, Tatibandh,
Raipur-492 099 (CG).

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.