AIIMS Raebareli Jobs 2022: నెలకు రూ. 2 లక్షల జీతంతో ఎయిమ్స్‌లో టీచింగ్‌ పోస్టులు.. ఈ అర్హతలుంటే నేరుగా ఇంటర్వ్యూ..

|

Oct 05, 2022 | 4:05 PM

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన రాయ్‌బరేలిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌.. ఒప్పంద/డిప్యుటేషన్‌/డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 100 ప్రొఫెసర్‌, అడిషనల్‌ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన..

AIIMS Raebareli Jobs 2022: నెలకు రూ. 2 లక్షల జీతంతో ఎయిమ్స్‌లో టీచింగ్‌ పోస్టులు.. ఈ అర్హతలుంటే నేరుగా ఇంటర్వ్యూ..
AIIMS Raebareli
Follow us on

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన రాయ్‌బరేలిలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌.. ఒప్పంద/డిప్యుటేషన్‌/డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 100 ప్రొఫెసర్‌, అడిషనల్‌ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అనాటమీ, అనెస్థీషియా, బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, డెర్మటాలజీ, ఎండోక్రినాలజీ, ఈఎన్టీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ అండ్‌ టాక్సికాలజీ, గ్యాస్ట్రోఎంటిరోలజీ, జనలర్‌ మెడిసిన్‌, జనరల్ సర్జరీ, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌, మెడికల్ ఆంకాలజీ, మైక్రోబయాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. మెడికల్ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ ఎంఎస్‌/ఎంసీహెచ్‌/డీఎమ్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించినవారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 58 యేళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 15, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులకు రూ. 2000, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు రూ.1000లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఒకవేళ దరఖాస్తు లెక్కకు మించి వస్తే మాత్రం రాతపరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.1,42,506ల నుంచి రూ.2,20,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

ఇవి కూడా చదవండి
  • ప్రొఫెసర్ పోస్టులు: 28
  • అడిషనల్ ప్రొఫెసర్ పోస్టులు: 22
  • అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు: 18
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు: 32

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.