AIIMS Recruitment 2023: నెలకు రూ.2,20,400ల జీతంతో ఎయిమ్స్‌లో టీచింగ్‌ ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా ఎంపిక

నాగ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్‌).. 10 ప్రొఫెసర్‌, అడిషనల్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌..

AIIMS Recruitment 2023: నెలకు రూ.2,20,400ల జీతంతో ఎయిమ్స్‌లో టీచింగ్‌ ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా ఎంపిక
AIIMS Nagpur

Updated on: May 29, 2023 | 2:19 PM

నాగ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్‌).. 10 ప్రొఫెసర్‌, అడిషనల్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కార్డియాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, ఈఎన్‌టీ, జనరల్ సర్జరీ, మైక్రోబయాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, గైనకాలజీ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఎస్‌, ఎండీ, పీజీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో టీచింగ్‌ అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్‌ విధానంలో జూన్‌ 6, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జనరల్‌/ఓబీసీ అభ్యర్ధులు రూ.2000లు, ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు రూ.500లు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులు ఎటువంటి ఫీజు లేదు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఈ కింది విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

జీతభత్యాల వివరాలు..

  • ప్రొఫెసర్‌ పోస్టులకు రూ.1,68,900ల నుంచి 2,20,400ల వరకు జీతంగా చెల్లిస్తారు.
  • అడిషనల్‌ ప్రొఫెసర్ పోస్టులకు రూ.1,48,200ల నుంచి 2,11,400ల వరకు జీతంగా చెల్లిస్తారు.
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ.1,01,500ల నుంచి 1,67,400ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అడ్రస్..

The Executive Director, AIIMS Nagpur, Administrative Block, Plot no.2, Sector -20, MIHAN,
Nagpur – 441108

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.