కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన గువాహటిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్).. 100 ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. బయో కెమిస్ట్రీ, కార్డియాలజీ, డెర్మటాలజీ, నెఫ్రాలజీ, గైనకాలజీ, యూరాలజీ, మెడికల్ ఆంకాలజీ, పెడియాట్రిక్స్, సైకియాట్రీ, రేడియాలజీ, సర్జికల్ ఆంకాలజీ, న్యూరాలజీ, హెమటాలజీ, పాథాలజీ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ ఎంఎస్/ పోస్టు గ్రాడ్యుయేషన్/ డాక్టరేట్ డిగ్రీ/ ఎంసీహెచ్/ డీఎం లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పోస్టును బట్టి ఏడాది నుంచి 14 ఏళ్ల వరకు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. స్టేట్/ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టరై ఉండాలి. అభ్యర్ధుల వయసు 50 నుంచి 58 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్న వారు ఏప్రిల్ 30, 2023వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం నింపిన దరఖాస్తులను కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు రూ.1500లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు. షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ1,01,500ల నుంచి రూ.1,68,900ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
All India Institute of Medical Sciences, Silbharal, Changsari, Guwahati, Assam -781101.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.