SWANATH Scholarship 2026: విద్యార్థులకు కేంద్రం బంపర్ గిఫ్ట్.. ఒక్క అప్లికేషన్‌తో మీ ఖాతాలోకి రూ.50 వేలు జమ

AICTE SWANATH Scholarship 2026 నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ, డిప్లొమా విద్యార్థులకు సంవత్సరానికి రూ.50,000 ఆర్థిక సాయం అందించనున్నారు. ప్రతియేట మాదిరి గానే ఈసారి కూడా 2 వేల స్కాలర్‌షిప్‌లు అందిస్తుంది. ఇందుకు సంబంధించిన అర్హతలు, దరఖాస్తు విధానం, చివరి తేదీ వివరాలతోపాటు దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఈ కింద చెక్ చేయండి..

SWANATH Scholarship 2026: విద్యార్థులకు కేంద్రం బంపర్ గిఫ్ట్.. ఒక్క అప్లికేషన్‌తో మీ ఖాతాలోకి రూ.50 వేలు జమ
AICTE Swanath Scholarship

Updated on: Jun 10, 2026 | 5:22 PM

ఏఐసీటీఈ (AICTE) ‘స్వనాథ్ స్కాలర్‌షిప్ 2026’కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న అనాథలు, కోవిడ్ 19 కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులు, విధి నిర్వహణలో అమరులైన సాయుధ దళాలు, కేంద్ర పారామిలిటరీ దళాల సిబ్బంది పిల్లలు, అలాగే తీవ్రమైన ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న, ప్రమాదంలో మరణించిన, 80 శాతం కంటే ఎక్కువ వైకల్యం పొందిన తల్లిదండ్రుల పిల్లలకు ఆర్థిక చేయూత అందించేందుకు యేటా ఈ స్కాలర్‌షిప్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా స్వనాథ్ స్కాలర్‌షిప్ 2026 పథకం కింద డిగ్రీ, డిప్లొమా కోర్సులు అభ్యసిస్తున్న అర్హులైన విద్యార్థులకు మొత్తం 2 వేల స్కాలర్‌షిప్‌లు అందించనున్నారు. ఇందులో డిగ్రీ విద్యార్థులకు 1000, డిప్లొమా విద్యార్థులకు 1000 చొప్పున అందిస్తున్నారు.

స్వనాథ్ స్కాలర్‌షిప్ 2026కు దరఖాస్తు చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఎంపికైన ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం అందుతుంది. ఈ మొత్తాన్ని కాలేజీ ఫీజులు, కంప్యూటర్ కొనుగోలు, పుస్తకాలు, స్టేషనరీ, సాఫ్ట్‌వేర్ తదితర విద్యా అవసరాల కోసం వినియోగించుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు ఏఐసీటీఈ ఆమోదించిన డిగ్రీ లేదా డిప్లొమా కోర్సుల్లో రెగ్యులర్‌గా చదువుతూ ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షలకు మించరాదు. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల ఇతర స్కాలర్‌షిప్‌లు పొందుతున్న విద్యార్థులు ఈ పథకానికి అనర్హులు. డిగ్రీ విద్యార్థులను ఇంటర్‌మీడియట్ (10+2)లో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ ప్రకారం ఎంపిక చేస్తారు. డిప్లొమా విద్యార్థుల ఎంపిక 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

దరఖాస్తు విధానం

అభ్యర్థులు జాతీయ స్కాలర్‌షిప్ పోర్టల్ (NSP) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థి చదువుతున్న విద్యాసంస్థ దరఖాస్తును ధ్రువీకరించిన అనంతరం సంబంధిత రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంత విద్యాశాఖ పరిశీలించి తుది ఎంపిక చేపడుతుంది. అర్హత కలిగిన విద్యార్థులు అక్టోబర్ 31, 2026లోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష ఉండదు. కేవలం మెరిట్‌ మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

స్వనాథ్ స్కాలర్‌షిప్ 2026కు దరఖాస్తు చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఈ కింది సర్టిఫికెట్లు తప్పనిసరి..

మరణ ధ్రువీకరణ పత్రాలు (అవసరమైతే), ఆదాయ ధ్రువీకరణ పత్రం, బోనాఫైడ్ సర్టిఫికేట్, 10వ తరగతి/ ఇంటర్ మార్కుల మెమోలు, కుల ధ్రువీకరణ సర్టిఫికేట్, ఆధార్ కార్డు వంటి ఇతర సర్టిఫికెట్లు తప్పనిసరిగా ఉండాలి. ఎంపికై విద్యార్ధులకు స్కాలర్‌షిప్ నగదు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతుంది. ఇతర వివరాలు ఈ కింది డైరెక్ట్‌ లింక్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

స్వనాథ్ స్కాలర్‌షిప్ 2026కు దరఖాస్తు చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us