AECS Recruitment: హైదరాబాద్‌ అటామిక్‌ ఎనర్జీ సెంట్రల్‌ స్కూల్‌లో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

|

Feb 17, 2022 | 5:44 PM

AECS Recruitment: అటామిక్‌ ఎనర్జీ సెంట్రల్‌ స్కూల్‌ (AECS ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైదరాబాద్‌లోని ఈ విద్యా సంస్థలో పలు టీచర్ పోస్టులను పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిని కాంట్రాక్ట్‌ విధానంలో భర్తీ చేయనున్నారు...

AECS Recruitment: హైదరాబాద్‌ అటామిక్‌ ఎనర్జీ సెంట్రల్‌ స్కూల్‌లో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Aecs Recruitment
Follow us on

AECS Recruitment: అటామిక్‌ ఎనర్జీ సెంట్రల్‌ స్కూల్‌ (AECS ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైదరాబాద్‌లోని ఈ విద్యా సంస్థలో పలు టీచర్ పోస్టులను పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిని కాంట్రాక్ట్‌ విధానంలో భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీచేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్ల (టీజీటీ), ప్రైమరీ టీచర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లలో భాగంగా ఇంగ్లిష్, సోషల్‌ సైన్స్, హిందీ/సంస్కృతం, మ్యాథ్స్‌/ఫిజిక్స్, బయాలజీ/కెమిస్ట్రీ, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్, ఆర్ట్‌ సబ్జెక్టుల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌తోపాటు బీఈడీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు.

* ప్రైమరీ టీచర్ పోస్టులకు అప్లై చేసుకునే వారు కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌తోపాటు డిప్లొమా(నర్సరీ టీచర్స్‌ ఎడ్యుకేషన్‌) ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను ప్రిన్సిపల్‌ కోఆర్డినేషన్, అటామిక్‌ ఎనర్జీ సెంట్రల్‌ స్కూల్‌–2, డీఏఈ కాలనీ, ఈసీఐఎల్‌ పోస్ట్, హైదరాబాద్‌–500062 అడ్రస్‌కు పంపించాలి.

* అభ్యర్థులను రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 11-02-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. ప్రియుడితో కలిసి భార్య ఏం చేసిందంటే..??

Tirumala: ప్రధాని నుంచి సామాన్యుడి వరకు అందరికీ ఒకే రకమైన భోజనం.. టీటీడీ సంచలన నిర్ణయం

Bheemla Nayak: పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ఆ రోజే భీమ్లా నాయక్‌ గ్రాండ్‌ ప్రిరిలీజ్‌ ఈవెంట్‌.?