Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JNU Admission 2021: జేఎన్‌యూ ఎంట్రెన్స్ టెస్ట్ అడ్మిట్ కార్డు విడుదల.. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..

JNU Admission 2021: జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని వివిధ కోర్సులలో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్ష అడ్మిట్ కార్డు విడుదల చేయడం జరిగింది.

JNU Admission 2021: జేఎన్‌యూ ఎంట్రెన్స్ టెస్ట్ అడ్మిట్ కార్డు విడుదల.. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..
Jnu
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 13, 2021 | 2:13 PM

JNU Admission 2021: జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని వివిధ కోర్సులలో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్ష అడ్మిట్ కార్డు విడుదల చేయడం జరిగింది. అడ్మిట్ కార్డ్, పరీక్ష సంబంధించిన పూర్తి వివరాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. జేఎన్‌యూలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ jnuexams.nta.ac.in ని సందర్శించడం ద్వారా అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, పుట్టిన తేదీ సాయంతో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. కాగా, జేఎన్‌యూ ప్రవేశ పరీక్ష సెప్టెంబర్ 21, 22, 23 తేదీల్లో జరుగనుంది.

అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేయడం ఎలా..? 1. అడ్మిట్ కార్డు కోసం ముందుగా అధికారిక వెబ్‌సైట్ jnuexams.nta.ac.in కి వెళ్లండి. 2. వెబ్‌సైట్‌లో ఇచ్చిన ‘అడ్మిట్ కార్డ్’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. 3. ఆ తరువాత పేజీలో మీ దరఖాస్తు రిజిస్ట్రేషన్ సంఖ్య, పుట్టిన తేదీని సమర్పించడం ద్వారా లాగిన్ అవ్వండి. 4. లాగిన్ అయిన తరువాత అడ్మిట్ కార్డ్ డిస్‌ప్లే అవుతుంది. 5. డిస్‌ప్లే అయిన అడ్మిట్ కార్డ్ వివరాలను సరి చూసుకుని ఆ తరువాత డౌన్‌లోడ్ చేసుకోండి. 6. పరీక్ష హాల్‌కు తీసుకెళ్లడానికై ఆ హాల్‌టికెట్‌ని ప్రింట్ అవుట్ తీసుకోండి.

ఈ విషయాలను గుర్తుంచుకోండి.. ఎంట్రన్స్ టెస్ట్‌కు హాజరయ్యే విద్యార్థులు.. అడ్మిట్ కార్డ్‌ను తమ వెంట తీసుకెళ్లాలి. అందులో ఏవైనా మార్పులు ఉంటే హాల్‌లోకి ఎంట్రీ ఇవ్వరు. అందుకే హాల్‌టికెట్‌లో ఏవైనా పొరపాట్లు ఉంటే అభ్యర్థులు వెంటనే ఎన్‌టీఏ హెల్ప్ డెస్క్‌ నెంబర్ 011-40759000 ని సంప్రదించవచ్చు లేదా.. jnu@nta.ac.in ఫిర్యాదు చేయొచ్చు.

ప్రవేశ పరీక్ష ఎప్పుడంటే.. జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష సెప్టెంబర్ 21, 22, 23 తేదీల్లో జరుగనుంది. ఈ పరీక్ష రెండు షెడ్యూళ్లలో నిర్వహించనున్నారు. మొదటి విడతలో భాగంగా ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.30 వరకు, రెండవ విడతలో భాగంగా మధ్యాహ్నం 2.30 నుండి 5.30 వరకు పరీక్ష నిర్వహిస్తారు. క్వశ్చన్ పేపర్ మొత్తం ఆబ్జెక్టీవ్ టైప్ లో ఉంటుంది. ఎల్ఏఎన్, సీబీటీ విధానంలో జరిగే ఈ పరీక్ష ఒక్క ఆంగ్లంలోనే నిర్వహిస్తారు.

Also read:

Inspiration Story: ఐఏఎస్ జాబ్‌ని వదిలి.. నేడు రూ .14,000 కోట్ల కంపెనీకి అధినేతగా మారిన ఓ యువకుడి సక్సెస్ స్టోరీ..

Kidnap and Rape: రైల్వే స్టేషన్‌ నుంచి ఇంటికి వెళ్తున్న బాలిక కిడ్నాప్.. ఆపై రైల్వే క్వార్టర్స్‌లోకి లాక్కెళ్లి..

TTD: అందుబాటులోకి టీటీడీ అగరబత్తులు.. వేటితో తయారు చేస్తారో తెలుసా..?

వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
టెన్త్ విద్యార్థులకు అలెర్ట్.. పరీక్షలపై కీలక ప్రకటన
టెన్త్ విద్యార్థులకు అలెర్ట్.. పరీక్షలపై కీలక ప్రకటన
వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
రికెల్టన్, సూర్య తుఫాన్ ఇన్నింగ్స్.. ముంబై ఖాతాలో తొలి విజయం
రికెల్టన్, సూర్య తుఫాన్ ఇన్నింగ్స్.. ముంబై ఖాతాలో తొలి విజయం
తనిఖిల్లో భాగంగా వాహనాన్ని ఆపిన పోలీసులు.. లోపల చెక్ చేయగా..
తనిఖిల్లో భాగంగా వాహనాన్ని ఆపిన పోలీసులు.. లోపల చెక్ చేయగా..
మీకు ఉన్న ఈ అలవాటును వెంటనే మానుకోండి..!
మీకు ఉన్న ఈ అలవాటును వెంటనే మానుకోండి..!
ఇంటర్నేషనల్ ప్లేయర్లతో కామెడీ ఆటలు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
ఇంటర్నేషనల్ ప్లేయర్లతో కామెడీ ఆటలు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
ముంబై ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌‌కు కొడాలి నాని తరలింపు
ముంబై ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌‌కు కొడాలి నాని తరలింపు
కెప్టెన్సీని విడిచిపెట్టే ముందు పరాగ్‌కు షాకిచ్చిన బీసీసీఐ
కెప్టెన్సీని విడిచిపెట్టే ముందు పరాగ్‌కు షాకిచ్చిన బీసీసీఐ
చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే..
చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే..