
కరీంనగర్, ఆగస్ట్ 30: విద్యా బుద్దులు నేర్చుకున్న చోటే విద్యాభ్యాసం నేర్పిస్తు చిన్నప్పటి ఙ్ఞాపకాలు నెమరేసుకుంటూ విద్యార్థులను తమకంటే ఉన్నత స్థానంలో చూడాలనీ ఆ ఉపాధ్యాయులు ఆశిస్తున్నారు. అందుకే చదువుకున్న పాఠశాల్లోనే ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ఒక్కరూ..కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 7 మంది..చదువుకున్న పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేయడం ఆసక్తిగా మారింది..
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో జెడ్పీ బాలుర పాఠశాల ఈ పాఠశాలకు చాలా చరిత్ర ఉంది. ఇక్కడ చదువుకున్న చాలామంది డాక్టర్లుగా, ఇంజనీర్లుగా విదేశాలలో స్థిరపడ్డారు. ఈ ప్రాంతంలో ఇదే మొదటి పాఠశాల కావడంతో ఈ ప్రాంతంలోని పేరుగాంచిన వ్యక్తులు ఇక్కడి నుండే విద్యాభ్యాసాన్ని ప్రారంభించారు. ఈ పాఠశాలలో ప్రస్తుతం 25 మంది ఉపాధ్యాయులు ఉండగా, 320 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే ఈ పాఠశాలలో ఉన్న 25 మంది ఉపాధ్యాయుల్లో ప్రధానోపాధ్యాయుడు బాదం సురేష్ బాబుతో ఏకంగా ఏడుగురు ఉపాధ్యాయులు
బొడిగల సమ్మయ్య, కట్కూరి వెంకట్ రెడ్డి, కొలుగురి సంపత్, మ్యాకమాల్ల శ్రీనివాస్, వట్టేపల్లి ప్రకాష్, రాం రాజయ్య, సంతోష్‌లు ఇదే పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు కావడం విశేషం.
గతంలో ఇదే పాఠశాలలో విద్యాభ్యాసం నేర్చుకొని పలుచోట్ల ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి ప్రస్తుతం ఈ పాఠశాలలో వివిధ సబ్జెక్టుల్లో విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నారు. గతంలో ఈ పాఠశాలలోనే చదివి ఇదే పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెప్పడం తమకు చాలా సంతోషాన్ని ఇస్తుందని, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే తమ కర్తవ్యమనీ ఉపాద్యాయులు అంటున్నారు. సహజంగా.. చదువుకున్న పాఠశాలలో.. భోధించే అవకాశం చాలా తక్కువ మందికి మాత్రమే వస్తుంది. కానీ.. ఏకంగా 7మంది ఉపాధ్యాయులకు చదువుకున్న పాఠశాలలో బోధించే అవకాశం రావడం అదృష్టంగా బావిస్తున్నామన్నారు. తాము కూర్చున్న తరగతి గదిలోనే.. ఇప్పుడు అదే తరగతి గదిలో పాఠలు చెప్పడం ఎంతో సంతోషంగా ఉందని చెబుతున్నారు ఆ 8 మంది ఉపాధ్యాయులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.