UGC Fake Universities: దేశంలో 22 ఫేక్‌ యూనివర్సిటీలు గుర్తింపు.. వీటిల్లో చదివితే కొంప కొల్లేరే! తెలుగు రాష్ట్రాల్లో ఎన్నంటే

ఎప్పటికప్పుడు యూజీసీ కొరడా జులిపించినా.. రకరకాల పేర్లతో నకిలీ గుర్తుంపులతో ఫేక్‌ యూనివర్సిటీలు ఛలామని అవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ ఇంజనీరింగ్‌ అనే పేరుతో ఓ ఇంజనీరింగ్‌ కాలేజీ తనకు తాను చట్టబద్దతను కల్పించుకుని దర్జాగా చలామని అవుతుంది. యూజీసీ ఈ వ్యవహారం గుర్తించి..

UGC Fake Universities: దేశంలో 22 ఫేక్‌ యూనివర్సిటీలు గుర్తింపు.. వీటిల్లో చదివితే కొంప కొల్లేరే! తెలుగు రాష్ట్రాల్లో ఎన్నంటే
UGC Fake Universities

Updated on: Oct 26, 2025 | 5:01 PM

హైదరాబాద్‌, అక్టోబర్‌ 26: దేశ వ్యాప్తంగా ఫేక్‌ యూనివర్సిటీలు గుట్టలుగా పుట్టుకొస్తున్నాయి. ఎప్పటికప్పుడు యూజీసీ కొరడా జులిపించినా.. రకరకాల పేర్లతో నకిలీ గుర్తుంపులతో ఛలామని అవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ ఇంజనీరింగ్‌ అనే పేరుతో ఓ ఇంజనీరింగ్‌ కాలేజీ తనకు తాను చట్టబద్దతను కల్పించుకుని దర్జాగా చలామని అవుతుంది. యూజీసీ ఈ వ్యవహారం గుర్తించి విద్యార్ధులెవ్వరూ దీనిలో ప్రవేశాలు పొందొద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఈ సంస్థ ఏ కేంద్ర లేదా రాష్ట్ర చట్టం కింద స్థాపించబడలేదని,సెక్షన్లు 2(f) లేదా 3 కింద గుర్తింపు పొందలేదని, విద్యా – వృత్తిపరమైన ప్రయోజనాల కోసం ఇది అందించే డిగ్రీలు చెల్లుబాటుకావని కమిషన్‌ స్పష్టం చేసింది. యూజీసీ పదే పదే కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, నకిలీ-డిగ్రీలు అందిస్తున్న యూనివర్సిటీలు పేర్లు మార్చుకుని పుట్టుకొస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మొత్తం 22 నకిలీ యూనివర్సిటీలను యూజీసీ గుర్తించింది. వీటిల్లో అత్యధికంగా 9 ఢిల్లీలోనే ఉన్నాయి. ఆ తర్వాత ఐదు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్నాయి. మిగిలినవి కేరళ, పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, పాండిచ్చేరిల్లో ఉన్నట్లు యూజీసీ గణాంకాలు చెబుతున్నాయి.

ఢిల్లీ నకిలీ వర్సిటీలు అధికంగా పుట్టుకురావడం కేవలం యాదృచ్చికం కాదు. రాజధానిలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉండటం, సులభంగా పేరు చెప్పుకోలేకపోవడం, అభివృద్ధి చెందుతున్న బ్రోకర్ నెట్‌వర్క్ వంటి అంశాలు అటువంటి ఆపరేటర్లకు అనుకూలమైన ప్రదేశాలుగా మారాయి. ఢిల్లీలో నకిలీగాళ్లు నేషనల్, టెక్నాలజీ, మేనేజ్‌మెంట్, ఇన్‌స్టిట్యూట్ వంటి పేర్లతో ఏమాత్రం అనుమానం కలగకుండా చట్టబద్ధంగా కనిపించేలా దందా చేస్తున్నారు. ఇక ఉత్తరప్రదేశ్‌లో కాస్త భిన్నంగా విద్యాపీఠ్, పరిషద్, ఓపెన్ యూనివర్సిటీ వంటి పేర్లతో ఫేర్‌ వర్సిటీలు అసలైన వాటి మాదిరి కొనసాగుతున్నాయి. వీటిల్లో తక్కువ ఖర్చుతో కూడిన, తక్కువ-ఎంట్రీ ప్రోగ్రామ్‌ల పేరిట ఆశ చూపి నిజమైన విద్య కంటే క్రెడెన్షియల్ ప్రత్యామ్నాయాలుగా పనిచేస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, పుదుచ్చేరి రాష్ట్రాల్లో తక్కువ నకిలీ యూనివర్సిటీలు ఉన్నప్పటికీ వీటికి అధిక డిమాండ్, సడలింపుల ప్రకటనలతో విద్యార్ధులను ఆకర్షిస్తున్నాయి. UGC గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల జాబితాను ,నకిలీ సంస్థల జాబితాను ఎప్పటికప్పుడు బహిరంగంగా అందుబాటులో ఉంచతుంది. అయినప్పటికీ ఎంతో మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఇప్పటికీ అధికారిక పోర్టల్‌లోని ఆధారాలను ధృవీకరించడానికి బదులుగా బ్రోచర్‌లు, ప్రకటనలు, నోటి మాట హామీలపై ఆధారపడుతున్నారు. కోచింగ్ ఏజెంట్ల ద్వారా ఫేక్‌ విద్యాసంస్థలపై బలమైన నమ్మకం కలిగించేందుకు ఆజ్యం పోస్తుంది. అయితే ఇలాంటి నకిలీలపై UGC నోటీసులు, హెచ్చరికలు మాత్రమే జారీ చేయగలదు. కానీ వీటిపై చర్యలకు ఉపక్రమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలదే. దీంతో వ్యవస్థలోని లొసుగులను ఆసరాగా చేసుకుని వీటిని మూసివేయడానికి బదులు రీబ్రాండ్ చేసి, కొత్త పేర్లతో వేరే చోటుకు మార్చుతున్నారు. ఈ సమస్యకు ప్రత్యేక నియమాలు లేకపోవడం కంటే వేగవంతమైన పరిణామాలు తీసుకోలేకపోవడం వల్ల కేటుగాళ్లకు ఊతమిస్తుంది. ఒక వేళ ఫేక్ వ్యవహారం బయటపడినా తక్కువ-రిస్క్, అధిక-రాబడి వచ్చే వ్యాపారంగా ఇది మారుతుంది. నకిలీ యూనివర్సిటీలు కేవలం లొసుగులను ఉపయోగించుకోవడమే కాదు.. అవి నమ్మకాన్ని దోచుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.