తెలంగాణలో ఇంజనీరింగ్ ఫైనల్ కౌన్సిలింగ్ కంప్లీటైపోయింది. కాలేజీల్లో చేరాలని స్టూడెంట్స్‌కి ఆదేశాలు కూడా ఇచ్చేసింది ప్రభుత్వం. కానీ, ఇంకా 15వేలకు పైగా సీట్లు మిగిలిపోవడమే మింగుడుపడని ఇష్యూగా మారింది. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మూడు విడతల్లో కౌన్సిలింగ్ నిర్వహించింది సాంకేతిక విద్యాశాఖ. AFRC సిఫార్సుల మేరకు మొత్తం 159 కాలేజీల్లో సీట్ల భర్తీ ప్రక్రియ చేపట్టింది. అయితే, తుది విడత సీట్ల కేటాయింపు తర్వాత ఇంకా 15వేల 447 ఇంజనీరింగ్ సీట్లు మిగిలిపోయినట్లు ప్రకటించింది టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్.
ఫైనల్ కౌన్సిలింగ్ కంప్లీట్ కావడంతో క్లాసులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది సాంకేతిక విద్యాశాఖ. ఆమేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈనెల 28 నాటికి కళాశాలల్లో చేరాలని స్టూడెంట్స్‌కి సూచించింది. ఆల్రెడీ ఇంజనీరింగ్ ఫీజులను కూడా ప్రభుత్వం ఖరారు చేయడంతో తరగతులు ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాయ్ కాలేజీలు. అయితే, 15వేలకు పైగా ఇంజనీరింగ్ సీట్లు మిగిలిపోవడమే ఇప్పుడు సంచలనంగా మారింది.
రాష్ట్ర వ్యాప్తంగా AFRC అనుమతి ఇచ్చిందే 159 కాలేజీలు. గతంలో పోల్చితే కాలేజీల సంఖ్య, సీట్ల సంఖ్యా తక్కువే. అయినా కూడా సీట్లు మిగిలిపోవడమే అటు సాంకేతిక విద్యాశాఖను, ఇటు కళాశాల యాజమాన్యాలను ఆలోచనలో పడేసింది. ఎందుకిలా? అనే ప్రశ్న కూడా ముందుకొచ్చింది. ఇంజనీరింగ్ కోర్సులపై ఇంట్రెస్ట్ తగ్గిందా? లేక అవసరానికి మించి సీట్లు అందుబాటులో ఉన్నాయా? అనేది తేలాల్సి ఉంది.
మరిన్ని కేరీర్&ఉద్యోగాల వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..