NEET UG 2024 Revised Ranks: కొంపముంచిన ఫిజిక్స్‌ ప్రశ్న.. ‘నీట్’ అర్హత కోల్పోయిన 15 మంది తెలుగు విద్యార్ధులు

|

Jul 29, 2024 | 7:20 PM

నీట్‌ యూజీ 2024 సవరించిన (రివైజ్‌డ్ రిజల్ట్స్‌) ఫలితాలను నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) జులై 26వ తేదీన వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో ఎన్టీయే సవరించిన ర్యాంకులను విద్యార్ధులందరికీ జారీ చేసింది. అయితే భౌతికశాస్త్రంలో ఓ ప్రశ్నలకు సరైన సమాధానం గుర్తించిన వారికి మాత్రమే మార్కులు కేటాయించడంతో.. దాదాపు 4.2 లక్షల మంది 5 మార్కులు కోల్పోయారు. దీంతో నీట్‌ యూజీ ప్రవేశ పరీక్ష ఫలితాలతో..

NEET UG 2024 Revised Ranks: కొంపముంచిన ఫిజిక్స్‌ ప్రశ్న.. నీట్ అర్హత కోల్పోయిన 15 మంది తెలుగు విద్యార్ధులు
NEET UG 2024 Revised Ranks
Follow us on

హైదరాబాద్‌, జులై 29: నీట్‌ యూజీ 2024 సవరించిన (రివైజ్‌డ్ రిజల్ట్స్‌) ఫలితాలను నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) జులై 26వ తేదీన వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో ఎన్టీయే సవరించిన ర్యాంకులను విద్యార్ధులందరికీ జారీ చేసింది. అయితే భౌతికశాస్త్రంలో ఓ ప్రశ్నలకు సరైన సమాధానం గుర్తించిన వారికి మాత్రమే మార్కులు కేటాయించడంతో.. దాదాపు 4.2 లక్షల మంది 5 మార్కులు కోల్పోయారు. దీంతో నీట్‌ యూజీ ప్రవేశ పరీక్ష ఫలితాలతో విద్యార్థుల ర్యాంకులు తారుమారయ్యాయి. కొందరు విద్యార్థుల ర్యాంకులు మెరుగుపడితే.. మరికొందరికేమో ర్యాంకులు అడుక్కుపడిపోయాయి. పేపర్‌ లీకేజీ, అవకతవకల నేపథ్యంలో ఇప్పటి వరకు మొత్తం మూడు సార్లు ఫలితాలు వెల్లడించారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోవల్సి వచ్చింది.

జూన్‌ 4న మొదట విడుదల చేసిన ఫలితాల్లో 47,371 మంది అర్హత సాధించగా, జులై 26న ఎన్టీఏ వెల్లడించిన ఫలితాల్లో 47,356 మంది అర్హత పొందారు. వీరి ర్యాంకుల్లోనూ స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రానికి చెందిన అనురన్‌ ఘోష్‌కు గతంలో జాతీయస్థాయిలో 77వ ర్యాంకు రాగా.. ఈ సారి 137వ ర్యాంకు వచ్చింది. గత ఫలితాల్లో గుగులోత్‌ వెంకటనృపేశ్‌కు ఎస్టీ కేటగిరిలో ఫస్ట్‌ ర్యాంకు, జాతీయస్థాయిలో 167వ ర్యాంకు వచ్చింది. అయితే తాజా ఫలితాల్లో ఎస్టీ కేటగిరిలో మొదటి ర్యాంకు, జాతీయ ర్యాంకు 219గా వచ్చింది. ఇక ఏకాంబరం కౌశిక్‌ అనే విద్యార్థికి తొలిసారి ఫలితాల్లో 43,802 ర్యాంకు రాగా.. తాజా ఫలితాల్లో 40,691 ర్యాంకు లభించింది. భౌతికశాస్త్రంలో విద్యార్థి పెట్టిన జవాబునే కమిటీ కూడా సూచించడంతో విద్యార్ధి ర్యాంకు మెరుగుపడింది. ఈ ప్రశ్నకు రెండో జవాబు గుర్తించిన మరో విద్యార్థి తొలి సారి ఫలితాల్లో ర్యాంకు 1,03,370 రాగా.. తాజా ఫలితాల్లో ఏకంగా 1,05,696 ర్యాంకు వచ్చింది. ఐదు మార్కులు విద్యార్ధుల ర్యాంకులను అస్తవ్యస్తంగా మార్చేశాయి. ఇలా అనేక మంది ర్యాంకుల్లో మార్పులు చోటు చేసుకోవడంతో విద్యార్ధులు గందరగోళానికి గురవుతున్నారు.

జులై 26వ తేదీన నీట్‌ యూజీ ప్రవేశపరీక్ష తుది ఫలితాలను (రీ-రివైజ్డ్‌) నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సవరించిన ‘కీ’ ప్రకారం ఫలితాలను వెల్లడించింది. తొలుత ఇచ్చిన ఫలితాల్లో పరీక్షలో భౌతికశాస్త్రానికి సంబంధించి ఓ ప్రశ్నకు రెండు సరైన సమాధానాలు ఇచ్చారు. దీంతో రెండింట్లో దేనిని గుర్తించినా తొలుత మార్కులిచ్చారు. దీనిపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించి, నిపుణుల కమిటీ ఏర్పాటు చేయగా.. సదరు కమిటీ ఒక జవాబునే పరిగణనలోకి తీసుకోవాలని సిఫార్సు చేసింది. దీనితో ప్రతి సరైన జవాబుకు నాలుగు మార్కులు, ప్రతి తప్పు జవాబుకు ఒక మైనస్‌ మార్కు ఉంటుంది. దీంతో భౌతిక శాస్త్రంలోని ఆ ప్రశ్నలకు తప్పు సమాధానం ఇచ్చిన వారికి 5 మార్కుల కొత విధించారు. సరైన సమాధానం పెట్టిన వారికి 4 మార్కులు కలిపారు. ఫలితంగా కొందరి ర్యాంకులు పెరిగిపోయాయి. కటాఫ్‌ మార్కులూ పెరిగాయి. ఈ క్రమంలో ర్యాంకుల అంచున ఉన్నవారికి ఎంబీబీఎస్‌ కోర్సులో ప్రవేశాల విషయంలో అనిశ్చితి నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.