AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రెవెన్యూలో 10,954 గ్రామస్థాయి పోస్టులు వస్తున్నాయ్‌!

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం (మార్చి 19) శాసనసభలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఇందులో విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్ర భట్టి ఇచ్చన బడ్జెట్‌ ప్రసంగంలో పలు కీలక అంశాలు ప్రస్తావించారు. ముఖ్యంగా రాష్ట్ర నిరుద్యోగులకు..

Telangana: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రెవెన్యూలో 10,954 గ్రామస్థాయి పోస్టులు వస్తున్నాయ్‌!
Minister Bhatti
Srilakshmi C
|

Updated on: Mar 19, 2025 | 2:01 PM

Share

హైదరాబాద్‌, మార్చి 19: తెలంగాణ శాసనసభలో రాష్ట్ర బడ్జెట్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం (మార్చి 19) ప్రవేశ పెట్టారు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత ప్రవేశ పెట్టిన రెండో బడ్జెట్‌ ఇది. ఇందులో విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారు. 2025-26 ఆర్ధిక సంవత్సరానికిగానూ రూ.3,04,965 కోట్లతో బడ్జెట్‌ను మంత్రి భట్టి విక్రమర్క సభకు సమర్పించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా పేర్కొన్నారు.

రెవెన్యూ విభాగంలో 10,954 గ్రామస్థాయి పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో మంత్రి భట్టి పేర్కొన్నారు. అలాగే జనవరి 26 నుంచి కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ మొదలైందని వెల్లడించారు. 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో ఇంటిగ్రేడెట్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సంక్షేమ హాస్టళ్లలో డైట్‌ చార్జీలు 40 శాతం, కాస్మొటిక్‌ చార్జీలు 200 శాతం పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

పలు శాఖలకు బడ్జెట్‌ కేటాయింపులు ఇలా..

  • వ్యవసాయ శాఖకు 24,439
  • పశు సంవర్ధక శాఖకు 1,674 కోట్లు
  • పౌరసరఫరాల శాఖకు 5,734 కోట్లు
  • విద్యాశాఖకు 23,108 కోట్లు
  • కార్మిక ఉపాధికల్పనకు 900 కోట్లు
  • పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధికి 31,605 కోట్లు
  • మహిళా శిశు సంక్షేమం కు 2,862 కోట్లు
  • షెడ్యూల్ కులాల సంక్షేమం కు 40,234 కోట్లు
  • షెడ్యూల్ తెగలకు 17,169 కోట్లు
  • వెనుకబడిన తరగతుల శాఖకు 11,405 కోట్లు
  • చేనేత రంగానికి 371 కోట్లు
  • మైనారిటీ సంక్షేమం కు 3,591 కోట్లు
  • పరిశ్రమల శాఖకు 3,527 కోట్లు
  • ఐటీ శాఖ కు 774 కోట్లు
  • విద్యుత్ శాఖకు 21,221 కోట్లు
  • వైద్య ఆరోగ్య శాఖకు 12,393 కోట్లు
  • మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖకు 17,677 కోట్లు
  • నీటిపారుదల శాఖకు 23,373 కోట్లు
  • హోం శాఖకు 10,188 కోట్లు
  • దేవాదాయ శాఖకు 190 కోట్లు
  • అడవులు పర్యావరణ శాఖకు 1,023 కోట్లు
  • క్రీడాశాఖకు 465 కోట్లు
  • పర్యాటకశాఖకు 775 కోట్లు
  • రోడ్లు భవనాలు శాఖకు 5,907 కోట్లు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.