
జీలియో భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కంపెనీలలో ఒకటి. 2021లో ప్రారంభించిన జూలియో భారత మార్కెట్లో లెజెండర్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విక్రయిస్తుంది. జీలియో ఇప్పుడు లెజెండర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు సంబంధించిన అప్‌డేట్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను తాజాగా విడుదల చేసింది. జీలియో లెజెండ్ ఫేస్‌లిఫ్ట్ మొత్తం 3 వేరియంట్లలో లభిస్తుంది. వీటిలో ఒకటి 32 ఏహెచ్ జెల్ బ్యాటరీ వేరియంట్, దీని ధరను రూ. 65,000గా నిర్ణయించారు. దీంతో పాటు 60వాట్స్/30ఏ లిథియం-అయాన్ బ్యాటరీ వేరియంట్ కూడా అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ స్కూటర్ ధరను రూ. 75,000గా నిర్ణయించారు. మూడో వేరియంట్ 74వీ/32ఏ లిథియం-అయాన్ బ్యాటరీ వేరియంట్. దీని ధర రూ. 79,000గా నిర్ణయించారు. జీలియో లెజెండ్ ఫేస్‌లిఫ్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీని ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేయడానికి 1.5 యూనిట్ల విద్యుత్ మాత్రమే అవసరమని కంపెనీ ప్రకటించింది.
జీలిలో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత అది 150 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని ఆ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ స్కూటర్ చాలా మంచి రైడింగ్ రేంజ్‌గా పరిగణించవచ్చని స్పష్టం చేస్తున్ానరు. అలాగే జీలియో లెజెండ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను ఆపరేట్ చేయడానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి కేవలం 1.5 యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది. తమిళనాడులో 400 యూనిట్ల వరకు విద్యుత్తును ఉపయోగించే వారికి ప్రస్తుత టారిఫ్ యూనిట్‌కు రూ. 4.80 మాత్రమే. కాబట్టి జీలియో లెజెండ్ ఫేస్‌లిఫ్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి కేవలం రూ.7.20 మాత్రమే ఖర్చవుతుంది. ఈ రూ.7.20 ఖర్చుతో మీరు 150 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. కాబట్టి జీలియో లెజెండ్ ఫేస్‌లిఫ్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అత్యంత సరసమైన వాటిలో ఒకటిగా పరిగణిస్తున్నారు.
జీలియో లెజెండ్ ఫేస్‌లిఫ్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం 3 రంగులలో లభిస్తుంది. ఆరెంజ్, గ్రీన్, గ్రే. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లతో వస్తుంది. జీలియో లెజెండ్ ఫేస్‌లిఫ్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, డిజిటల్ డ్యాష్‌బోర్డ్, కీలెస్ ఎంట్రీ, సెల్ ఫోన్ ఛార్జర్, పార్క్ అసిస్ట్, ఫాలో మీ హోమ్ లైట్లు వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. అందువల్ల పెట్రోల్ ధర ఎక్కువగా ఉండటం వల్ల ఎలక్ట్రిక్ స్కూటర్‌కు మారాలని ఆలోచిస్తున్న కస్టమర్లకు జీలియో లెజెండ్ ఫేస్‌లిఫ్ట్ ఒక మంచి ఎంపిక అని ఆ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి