SIP Calculator: నెలకు రూ.10వేలు చాలు.. మూడేళ్లలో రూ.11 లక్షలు అవుతాయి.. కాలు కదపకుండా సంపాదించవచ్చు..

కేవలం నెలకు రూ. 10,000 పెట్టుబడితో మూడేళ్లలో రూ. 11 లక్షల వరకూ సంపాదించొచ్చు. అది వ్యాపారం కాదు. అలా అని ఉద్యోగం కూడా కాదు. మరేంటది? మూడేళ్లలో లక్షలు తెచ్చిపెట్టే ట్రిక్ ఏమిటో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ కథనం వెంటనే చదివేయండి..

SIP Calculator: నెలకు రూ.10వేలు చాలు.. మూడేళ్లలో రూ.11 లక్షలు అవుతాయి.. కాలు కదపకుండా సంపాదించవచ్చు..
Sip

Updated on: Apr 13, 2023 | 4:00 PM

తక్కువ సమయంలో లక్షాధికారి కావాలని కలలు కంటున్నారా? అయితే మీకో బెస్ట్ ఆప్షన్ ఉంది. కేవలం నెలకు రూ. 10,000 పెట్టుబడితో మూడేళ్లలో రూ. 11 లక్షల వరకూ సంపాదించొచ్చు. అది వ్యాపారం కాదు. అలా అని ఉద్యోగం కూడా కాదు. మరేంటది? మూడేళ్లలో లక్షలు తెచ్చిపెట్టే ట్రిక్ ఏమిటి అని ఆలోచిస్తున్నారా.. అదేనండి మ్యూచువల్ ఫండ్స్. అవును మీరు మీరు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడితే అధిక రాబడి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ లో చాలా రకాలున్నాయి. ముఖ్యంగా స్మాల్ క్యాప్ ఫండ్ లో పెట్టుబడి పెడితే మంచి రాబడులు వస్తున్నాయి. అయితే దీనిలో కాస్త రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. కచ్చితంగా రాబడి వస్తుందన్న గ్యారంటీ లేదు. ఈ స్మాల్ క్యాప్ ఫండ్ గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి..

మూడేళ్లలో లక్షలు..

క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ లో పెట్టుబడులు పెట్టిన వారికి ప్రస్తుతం అధిక రాబడులు వస్తున్నాయి. దీనిలో రెండు రకాలుగా పెట్టుబడులు పెట్టవచ్చు ఒకటి డైరెక్ట్ ప్లాన్, రెండోది రెగ్యూలర్ ప్లాన్. గత మూడేళ్లలో ఈ క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ లో పెట్టుబడి పెట్టిన వారి పంట పండింది. డైరెక్ట్ ప్లాన్ కింద పెట్టుబడి పెట్టిన వారు దాదాపు 64.5 శాతం రాబడిని పొందాు. మ్యూచువల్ ఎస్ఐపీ క్యాలిక్యులేటర్ ప్రకారం వారు నెలకు రూ. 10,000 చొప్పున పెట్టుబడి పెట్టారు. అలా పెట్టగా వారికి మూడేళ్లలో దాదాపు రూ. 10.9 లక్షలు రాబడి వచ్చింది. అదే రెగ్యూలర్ ప్లాన్ లో అయితే 62.19శాతం రాబడిని వారు పొందారు. నెలకు రూ. 10,000 చొప్పున లెక్కకడితే దాదాపు వారు రూ. 10.4 లక్షలు సంపాదించారు. అయితే దీనిలో పెట్టుబడి పెట్టేముందు కొన్ని అంశాలను తెలుసుకోవాలి. అవేంటే చూద్దాం..

క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్.. ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే స్మాల్ క్యాప్ కంపెనీలలో పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో అధిక ఆర్థిక వృద్ధి అందించమే లక్ష్యంగా ఉంటుంది. ఈ పథకం 29 అక్టోబర్ 1996న ప్రారంభించారు. సాధారణంగా దీనిలో పెట్టుబడి పెడితే దాదాపు మీకు 11.55శాతం రాబడిని అందిస్తుందని ఏఎంఎఫ్ఐ వెబ్ సైట్లోని డేటా స్పష్టం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

టాప్ స్టాక్ హోల్డింగ్స్.. ఏప్రిల్ 2023 ఫండ్స్ ఫ్యాక్ట్ షీట్ ప్రకారం ఈ స్మాల్-క్యాప్ ఫండ్ కలిగి ఉన్న టాప్ 10 స్టాక్‌లు ఇవే.. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీస , హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ , జిందాల్ స్టెయిన్‌లెస్, ఆర్‌బీఎల్ బ్యాంక్, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బికాజీ ఫుడ్స్ ఇంటర్నేషనల్, ఉషా మార్టిన్, జస్ట్ డయల్.

  • ఈ పది స్టాక్ లే దాదాపు 44.30 శాతం నెట్ అసెట్ వాల్యూ(ఎన్ఏవీ)ని కలిగి ఉన్నాయి. ఈ మొత్తం ఎన్ఏవీ నిధులలో 96.43 శాతం ఈక్విటీ, ఈక్విటీ రిలేటెడ్ సాధనాల్లో పెట్టుబడిగా వెళ్తుంది. నగదు, ఇతర రాబడులు ఎన్ఏవీలో 3.56%గా ఉన్నాయి.
  • క్వాంట్ స్మాల్ క్యాప్ పథకం తన నిధులలో 15.3% బ్యాంకులకు కేటాయిస్తుంది. ఆ తర్వాత పెట్రోలియం ఉత్పత్తులు 6.52%, ఫార్మాస్యూటికల్స్ 5.86%, నిర్మాణ రంగానికి 5.78% శాతం కేటాయిస్తుంది.
  • ఈ ఫండ్ ను అంకిత్ పాండే, వాసవ్ సహగల్, సంజీవ్ శర్మచే నిర్వహించబడుతుంది. ఒక సంవత్సరంలోపు పూర్తయ్యే పథకం అయితే ఎగ్జిట్ లోడ్ స్ట్రక్చర్ 1% ఉంటుంది.

(నోట్: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు మార్కెట్ రిస్క్ లకు లోబడి ఉంటాయి. రాబడి ఎప్పుడూ ఒకేలా ఉండదు. మీరు పెట్టుబడి పెట్టేముందు ఆర్థిక నిపుణుడిని సంప్రదించండి)

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..