Hyundai discounts: ఇయర్ ఎండింగ్‌లో బంపర్ ఆఫర్.. హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్లు

|

Dec 08, 2024 | 7:30 AM

దేశంలో కార్లను వినియోగించేవారు క్రమంగా పెరుగుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు తమ స్థాయికి అనుగుణంగా వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్ల మార్కెట్ అమ్మకాల జోరుతో టాప్ గేర్ లో పరుగులు పెడుతోంది. అలాగే పలు కంపెనీలు ప్రజల ఆదాయ స్థాయికి అనుగుణంగా వివిధ కార్లను తయారు చేస్తున్నాయి. దసరా, దీపావళి సీజన్ లో కార్ల అమ్మకాలు ఓ మాదిరిగా సాగాయి. ఆ పండగలు వెళ్లిపోవడంతో మార్కెట్ లో కొంత ఉత్సాహం తగ్గింది. ఈ సమయంలో ప్రముఖ కంపెనీ హ్యుందాయ్ ఇయర్ ఎండ్ డిస్కౌంట్ ను ప్రకటించింది.

Hyundai discounts: ఇయర్ ఎండింగ్‌లో బంపర్ ఆఫర్.. హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్లు
Hyundai
Follow us on

దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ కార్లకు మన దేశంలో డిమాండ్ బాగుంది. ఈ కంపెనీ వాహనాల కోసం ప్రజలు ఎదురు చూస్తుంటారు. ఈ నేపథ్యంలో వెన్యూ, ఎక్స్ టర్, ఐ20 మరియు గ్రాండ్ ఐ10 కార్లపై ఇయర్ ఎండ్ డిస్కౌంట్ ప్రకటించింది. వీటితో సహా కొన్నిమోడళ్లపై సుమారు రూ.75 వేల వరకూ తగ్గింపు లభిస్తుంది. నవంబర్ నెలలో అత్యధికంగా అమ్ముడైన హ్యుందాయ్ కార్లలో వెన్యూ ఒకటి. దీనికి కస్టమర్ల ఆదరణ చాలా బాగుంది. ఇయర్ ఎండింగ్ ఆఫర్ లో భాగంగా ఈ కారుపై రూ.75 వేల తగ్గింపు లభిస్తుంది. ప్రస్తుతం హ్యుందాయ్ వెన్యూ రూ.7.94 లక్షల నుంచి రూ.13.44 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య అందుబాటులో ఉంది. మూడు ఇంజిన్ ఎంపికలతో పాటు ఏడు ట్రిమ్ స్థాయిలలో దొరుకుతుంది.

ప్రత్యేకతలు ఇవే..

హ్యుందాయ్ వెన్యూలోని 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ నుంచి 82 బీహెచ్పీ, 114 ఎన్ఎం టార్క్ విడుదల అవుతుంది. అలాగే 1.0 లీటర్ల టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ 118 బీహెచ్ పీ, 172 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. వీటిలో 1.2 లీటర్ల యూనిట్ కు ఐదు స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్ మిషన్ జత చేశారు. టర్బో ఇంజిన్ కు ఆర్ స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఏడు స్పీడ్ డీసీటీ గేర్ బాక్స్ ను ఎంపిక చేసుకోవచ్చు. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 113 బీహెచ్పీ, 250 ఎన్ఎం టార్క్ ను విడుదల చేస్తుంది. దీనికి ఆరు స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్ మిషన్ జత చేశారు.

ఎక్స్ టర్ పై రూ.53 వేల డిస్కౌంట్

హ్యుందాయ్ నుంచి విడుదలైన ఎక్స్ టర్ కారు మైక్రో ఎస్ యూవీ విభాగంలో ఎంతో ఆదరణ పొందింది. దీని ధర రూ.6.13 లక్షల నుంచి రూ.10.43 లక్షల (ఎక్స్ ఫోరూమ్) వరకూ ఉంది. డిసెంబర్ లో ప్రకటించిన ఇయర్ ఎండ్ డిస్కౌంట్ లో రూ.53 వేల తగ్గింపు లభిస్తుంది. ఎక్స్ టర్ లోని 1.2 లీటర్ కప్పా నాలుగు సిలిండర్ పెట్రోలు ఇంజిన్ 82 బీహెచ్ పీ, 113.8 టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి ఐదు సీడ్ మ్యాన్యువల్ లేదా ఏఎంటీ ట్రాన్స్ మిషన్ జత చేశారు. దీనిలోని సీఎన్ జీ వేరియంట్ 68 బీహెచ్ పీ, 95.2 ఎన్ ఎం టార్క్ విడుదల చేస్తుంది. మెరుగైన కార్గో స్పేస్ కోసం డ్యూయల్ సిలిండర్ సీఎన్ జీ సాంకేతికత ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

గ్రాండ్ నియోస్, ఐ20

హ్యచ్ బ్యాక్ శ్రేణిలో గ్రాండ్ నియోస్, ఐ 20 మోడళ్లపై కూడా హ్యుందాయ్ ఇయర్ ఎండ్ డిస్కౌంట్ ప్రకటించింది. గ్రాండ్ నియోస్ ధర రూ.6 లక్షల నుంచి రూ.8.50 లక్షల (ఎక్స్ షోరూమ్) ఉంది. డిసెంబర్ లో ఈ కారుపై రూ.68 వేల తగ్గింపు అందజేస్తున్నారు. కాగా.. ఐ10 ధర రూ.7 లక్షల నుంచి రూ.11.20 లక్షల వరకూ ఉంది. ఈ కారుపై రూ.65 వేల డిస్కౌంట్ అందజేస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి