భారతదేశంలో బైక్ లవర్స్‌కు యమహా కంపెనీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా స్పీడ్ బైక్స్ విషయంలో యమహా ప్రత్యేక ట్రాక్ రికార్డు కలిగి ఉంది. అయితే ఇటీవల కాలంలో యమహా నుంచి ప్రత్యేకంగా బైక్స్ రిలీజ్ కావడం లేదు. అయితే తాజాగా యమహా ఇండియా రెండు ప్రత్యేక బైక్స్‌ను రిలీజ్ చేసింది. ఎట్టకేలకు ఆర్3, ఎంటీ-3లను భారత మార్కెట్‌లో రిలీజ్ చేసింది. వీటి ధర ఆర్ రూ.4.65 లక్షలు, ఎంటీ-3 రూ.4.60 లక్షలుగా ఉంది. అయితే ఈ ధరలు ఎక్స్-షోరూమ్ మాత్రమేనిని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ రెండు మోటర్ సైకిళ్లు యమహా బ్లూ స్క్వేర్ డీలర్‌షిప్‌ల ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. అయితే ఈ మోటర్ సైకిళ్లు ప్రస్తుతానికి నిర్మిత యూనిట్‌గా మాత్రమే భారతదేశంలోకి వస్తాయి. అయితే డిమాండ్‌ను బట్టి ఈ బైక్‌ల ధరలను యమహా తగ్గించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. కాబట్టి యమహా రిలీజ్ చేసిన ఈ రెండు బైక్‌ల ఫీచర్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.
యమహా రిలీజ్ చేసిన రెండు బైక్స్ ధరల పరంగా చాలా ఎక్కువని ఆటోమొబైల్ రంగ నిపుణులు పేర్కొంటున్నప్పటికీ ఫీచర్ల విషయంలో మాత్రం ఈ రెండు బైక్స్ వాటి ప్రత్యేకతను నిరుపిస్తాయని వివరిస్తున్నారు. ఇటీవల కేటీఎం రిలీజ్ చేసి 390 డ్యూక్ రూ.3.11 లక్షల వద్ద దొరుకుతుంది. అలాగే ఏప్రిల్లా ఆర్‌ఎస్ 457 కూడా రూ.4.10 లక్షల వద్ద ఉంది. యమహా ఆర్3, ఎంటీ-3 రెండు బైక్స్ 321 సీసీ లిక్విడ్ కూల్డ్ సీసీ ఇంజిన్స్‌తో వస్తాయి. 10750 ఆర్‌పీఎం వద్ద 41.4 బీహెచ్‌పీ గరిష్ట శక్తిని, 9000 ఆర్‌పీఎం వద్ద 29.6 ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ ఫీచర్స్‌తో రావడం వల్ల ఈ ఇంజిన్ చాలా స్మూత్‌గా ఉంటుందని కంపెనీ ప్రతినిధులు వివరిస్తున్నారు. అధిక రివివింగ్ ఇంజిన్ కారణంగా రైడర్ శక్తిని ఉపయోగించే సమయంలో థొరెటల్‌ను ట్విస్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎలాంటి వైబ్రేషన్స్ లేకుండా 6000 ఆర్‌పీఎం వద్ద 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
ఆర్3, ఎంటీ-3 ఫీచర్ల పరంగా చాలా ప్రాథమికమైనవి. ట్రాక్షన్ కంట్రోల్, రైడింగ్ మోడ్‌లు, బ్లూటూత్ కనెక్టవిటీ వంటి ఫీచర్లు ఈ బైక్స్‌లో లేవు. డ్యుయల్ చానల్ ఏబీఎస్, అన్ని ఎల్‌ఈడీ లైటింగ్, ప్రాథమిక సమాచారన్ని మాత్రమే చూపే డిజిటల్ ఇన్‌స్ట్రుంమెంట్ క్లస్టర్‌ను మాత్రమే పొందుతాయి.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం